Anasuya: అనసూయ క్రేజ్ మామూలుగా లేదుగా.. రంగమ్మత్తను చూడడానికి భారీగా వచ్చిన అభిమానులు?

తెలుగు ప్రేక్షకులకు యాంకర్, నటి అనసూయ భరద్వాజ్( Anasuya Bharadwaj ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు బుల్లితెర పై హాట్ యాంకర్ లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్.

 Anchor Anasuya Bharadwaj Gets Huge Response From Youth-TeluguStop.com

కాగా అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.అయితే మొన్నటి వరకు బుల్లితెరను అటు వెండితెర ను బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన అనసూయకు ప్రస్తుతం వెండితెర పై అవకాశాలు ఎక్కువ అవ్వడంతో బుల్లితెర కు గుడ్ బాయ్ చెప్పేసింది.

కేవలం యాంకర్ గానే కాకుండా నటిగా కూడా తన సత్తాను చాటుకుంటోంది.

ఇది ఇలా ఉంటే అనసూయకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.మరి ముఖ్యంగా యూత్ లో ఈమెకు విపరీతమైన ఫాన్స్ ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా అనసూయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పలాసకు ( Palasa ) వచ్చారు.

షాపింగ్ మాల్ ఓపెనింగ్( Shopping mall opening ) కోసం ఆమె పలాసకు వచ్చింది.అయితే అనసూయ వస్తుంది అని తెలియడంతో ఆమె రాకను తెలుసుకున్న యువత అక్కడకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

అభిమానులతో మాట్లాడడంతో పాటు రెండు స్టెప్పులు కూడా వేసింది.దాంతో పలాస నగరం జనాలతో నిండిపోయింది.

అక్కడ జనాలను చూసి రంగమ్మత్తకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా అని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం అనసూయ చేతిలో లెక్కకు మించిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి.ఇప్పటికే ఈమె పుష్ప 2, రంగమార్తాండ చిత్రాల్లో నటిస్తున్న విషయం తేలిసిందే.మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.పుష్ప 2లో అనసూయ విలన్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.

దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో అనసూయ రోల్ పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube