ట్రంప్ కోటరీ లో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి

అమెరికా అధ్యక్షుడు కోటరీలో ఉన్నతమైన పదవి దక్కడం అనే ఆషామాషీ వ్యవహారం కాదు…ఎంతో మంది అధ్యక్షుడి దృష్టిలో పడటానికి ఆయన దగ్గర పని చేయడానికి ఉవ్విళ్ళురూతూ ఉంటారు అయితే ఈ అదృష్టం భారత సంతతి వ్యక్తిని వరించింది.”ఉత్తమ్‌ థిల్లాన్‌” అనే భారత సంతతి వ్యక్తికి న్యాయశాస్త్రంలో విశేష ప్రతిభ ఉన్న ఉత్తమ్‌ను కీలకమైన డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీకి నూతన చీఫ్‌గా నియమితులయ్యారు.

 An Indian Gets Major Role In Trumps Kothari-TeluguStop.com

ఈ డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ సంస్థ అమెరికాలో డ్రగ్స్‌ స్మగ్లింగ్‌, మత్తుపదార్థాల వాడకాన్ని నియంత్రిస్తుంది.30 ఏండ్ల సర్వీసు అనంతరం రాబర్ట్‌ పాటర్సన్‌ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ఉత్తమ్‌ను నియమిం చారు.

ఉత్తమ్‌ ఇంతకుముందు వైట్‌హౌస్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌కు డిప్యూటీ కౌన్సిల్‌, డిప్యూటీ అసిస్టెంట్‌గా పనిచేశారు.డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు…అయితే అమెరికాల్ ప్రతీ తొమ్మది నిమిషాలకి ఒక వ్యక్తీ డ్రగ్స్ బారిన పడి చనిపోవడం సాదారణగా జరిగిపోతోంది.

ఇలాంటి సమయంలో డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ యంత్రాంగం డ్రగ్స్‌ను అరికట్టే దిశగా తీవ్రంగా ఉత్తమ్ తీవ్రంగా కృషిచేయాలని తెలిపారు…అధ్యక్షుడు ట్రంప్‌ కూడా మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు బలమైన అధికారాలు ఇస్తున్నారని వెల్లడించారు…ఉత్తమ్‌ ఇంతకు ముందే వైట్‌హౌస్‌లోని న్యాయ విభాగం, హోమ్‌ల్యాండ్‌ సెక్యురిటీ విభాగాల్లో పలు కీలక పదవులని చేపట్టారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube