స్కూల్‌కు విద్యార్థులు యూనిఫామ్ వేసుకొని వెళ్లడం సర్వ సాధారణం.పిల్లలు ఎలాంటి యూనిఫామ్ వేసుకోవాలే.
ఆయ స్కూల్ యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్ నిర్ణయిస్తుంటారు.యూనిఫామ్ వరకు నిబంధనలు ఓకే.అమ్మాయిలు వేసుకునే లోదుస్తులపై కూడా ఆంక్షలు పెడితే అదెంత అసభ్యంగా ఉంటుంది.అలంటి ఓ నీచమైన ఘటనే మహారాష్ట్రలోని పుణేలో విశ్వశాంతి గురుకుల్ పాఠశాల లో చోటు చేసుకుంది.
అమ్మాయిల లోదుస్తులపై ఆదేశాలు జారీ చేయడం వివాదాస్పదమైంది.బాలికల లోదుస్తుల రంగుపై ఆ విద్యాసంస్థ జారీ చేసిన ఉత్తర్వులు పెద్ద దుమారమే రేపింది.
క్రమశిక్షణ పేరుతో స్కూళ్లు హద్దులు మీరుతున్నాయి.వింత వింత నిబంధనలు అమలు చేస్తూ విద్యార్థులను, తల్లిదండ్రులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నాయి.
పూణేలోని ఓ స్కూల్ ఏకంగా ఆడపిల్లలు వేసుకోవాల్సిన లోదుస్తులపైనా కలర్ కోడ్ ప్రకటించింది.కేవలం తెలుపు లేదా చర్మపు రంగు లోదుస్తులు మాత్రమే ధరించాలంటూ ఆర్డర్ వేసింది.

బాలికలు తెలుపు లేదా చర్మపు రంగు లోదుస్తులు మాత్రమే ధరించాలని స్కూల్ డైరీలో పేర్కొంది.ఈ నిబంధనలకు కట్టుబడి ఉంటామని పేరెంట్స్ అందరూ సంతకాలు పెట్టాలనీ.లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యం హెచ్చరించినట్టు పేరెంట్స్ లబోదిబోమంటున్నారు.
లోదుస్తులతో పాటు మరిన్ని అంశాలపై కూడా పలు సూచనలు చేసారు.రౌండ్ ముక్కుపుడక ధరించాలని, అది కూడా 0.3 సెంటీమీటర్లకు ఎక్కువగా ఉండవద్దని పేర్కొన్నారు.అంతేకాదు స్కూల్‌లో వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా.తరగతుల వారీగా టైమ్ స్లాట్లు కేటాయించారని ఆరోపిస్తున్నారు.లోదుస్తుల వ్యవహారంతో పాటూ దీనిపై ప్రైమరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఫిర్యాదు చేశారు.
ఇది చూసిన తల్లిండ్రులు స్కూల్ తీరుపై భగ్గుమన్నారు.
లోదుస్తులపై కూడా ఇలాంటి నిబంధనలు పెట్టడం ఏంటని మండిపడుతున్నారు.కొంతమంది స్కూల్ ఎదుట ధర్నాకు దిగారు.
వెంటనే ఈ ఆదేశాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మరోవైపు స్కూల్ యాజమాన్యం మాత్రం బాలికల భద్రత కోసమే ఈ నియమాలను పొందుపరిచామని సమర్ధించుకుంటోంది
.






