ట్రంప్ కి దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది.తాను తీసుకునే నియంతృత్వ విధానం వలన ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు.
కేవలం ప్రపంచ వ్యాప్తంగా మాత్రమే కాదు సొంత దేశం అమెరికా లో సైతం ట్రంప్ విధానాలపై నిరసనలు రేగుతున్నాయి.వలసల పై ట్రంప్ విధానాలపై ఇప్పటికే నిరసనలు పెరిగిపోతున్న తరుణంలో.
తాజాగా ట్రంప్ పై మరోసారి నిరసనలు హోరెత్తాయి.వివరాల్లోకి వెళ్తే.
వలస విధానంలో మార్పుల్లో భాగంగా అమెరికా ప్రభుత్వం రెండు నెలల కిందట తెచ్చిన ఓ నిబంధనను అక్కడి కాలేజీలు, ఓ యూనివర్సిటీ సవాల్ చేశాయి.ఆ రూల్ వల్ల.అనేక మంది విద్యార్థులను చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్నట్లుగా గణించే వీలు ఏర్పడుతుందని, ఆ నిబంధననే చట్టవిరుద్ధమైనది ప్రకటించాలని కోరాయి.ఈ మేరకు గిల్‌ఫోర్డ్, హేవర్‌ఫోర్డ్, ఫుట్‌హిల్ అనే కాలేజీలు, న్యూ స్కూల్ అనే న్యూయార్క్‌లోని ప్రైవేటు విశ్వవిద్యాలయం.
ఉత్తర కరోలినా మిడిల్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఓ పిటిషన్ వేశాయి.అమెరికాలో ఉన్నతవిద్య, రిసెర్చ్ కోసం వెళ్లే విద్యార్థులకు….ఎఫ్,ఎం,జే వీసాలిస్తారు.
ఇప్పటిదాకా ఉన్న నిబంధన ఏంటంటే- తమకిచ్చిన గడువు ముగిసిన తరువాత అమెరికా ప్రభుత్వం పంపిన 180 రోజులదాకా అక్కడ ఉండే అవకాశం కల్పిస్తుంది గడువు తీరిన తరువాత.
‘చట్టవిరుద్ధంగా నివసిస్తున్నారన్న’ అభియోగం వర్తించేది… కానీ కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం గడువు తీరిన మరుక్షణం ఆటోమేటిక్‌గా ‘ఔట్ ఆఫ్ స్టేటస్’ అనే ముద్ర పడుతుంది…అది పూర్తయ్యేలోగా ఏ దేశానికి సంబంధించిన వారు వారి ప్రదేశాలకు వెళ్ళి పోవాల్సిందే.
ఒకవేళ అలా వెళ్ళని పక్షంలో ఆ వ్యక్తి మీద ‘అక్రమ నివాస ముద్ర’ పడుతుంది.ఒకసారి ఆ ముద్ర పడితే మూడు నుంచి పదేళ్ల దాకా అమెరికాలో అడుగుపెట్టడం నిషిద్ధం.దాంతో ఈ విధానంపై అమెరికాలోని ప్రఖ్యాత కాలేజీలు మండిపడుతున్నాయి.
ఒక విద్యార్థి మీద లేదా రిసెర్చ్ స్కాలర్ మీద అక్రమ నివాస ముద్రను వేయడం వల్ల అతని చదువుపై ప్రతికూల ప్రభావం పడుతుందని, భవిష్యత్తులో ఆ విద్యార్థి అమెరికాలో అడుగుపెట్టలేని పరిస్థితి ఏర్పడుతుందని ఇది అమెరికా లోని కాలేజీల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.