అమెరికాలో మహిళల నిరసనల సెగలు..

అమెరికాలో ట్రంప్ పై రోజు రోజుకి నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికా ప్రజలకి ఎంతో భారంగా ఉండటమే కాకుండా ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకునే విధంగా ఉంటున్నాయి గతంలో వలస విధానాల విషయంలో ట్రంప్ చేపట్టిన చర్యలు కూడా ఎంతో హేయంగా ఉన్నాయని అక్కడి ప్రజలు నిరసనలు తెలిపారు ఏకంగా ట్రంప్ సతీమణి సైతం ట్రంప్ కి వ్యతిరేకంగా మాట్లాడారంటే ట్రంప్ నిర్ణయాలపై ఎంతటి వ్యతిరేకత ఉందొ అర్థం చేసుకోవచ్చు.

 American Ladies Protest About Trump-TeluguStop.com

అయితే తాజాగా ట్రంప్ మరొక నిర్ణయంతో అక్కడి మహిళలు రోడ్లపైకి వేల సంఖ్యలో వచ్చి నిరసనలు తెలుపుతున్నారు ఇంతకీ ఆ మహిళల కోపానికి కారణం ఏమిటంటే అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ బ్రెట్‌ కావెనాను నియమించాలని ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు

లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్‌ కావెనాను సుప్రీంకోర్టుకు నియమించరాదు అంటూ ఆ మహిళలు అందరూ వేలాది సంఖ్యలో మహిళలు క్యాపిటల్‌ హిల్‌ ముందు ర్యాలీ నిర్వహించారు.

అయితే ఈ నిరసనలు చేపడుతున్న వందలాది మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.జస్టిస్‌ కావెనాపై ఎఫ్‌బీఐ ఇచ్చిన నివేదికను ఆందోళన నిర్వహిస్తున్న మహిళలు వ్యతిరేకించారు.అయితే సుప్రీంకోర్టులో పట్టు కోసం మాత్రం జస్టిస్‌ కావెనానే నియమించాలని ట్రంప్‌ గట్టి నిర్ణయమే తీసుకున్నారు.

ట్రంప్ పాలనలో కనీసం ఏ వర్గాన్ని కూడా ఆకర్షించుకోలేక పోయారని అక్కడి ప్రజలు విమర్శలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube