మన టాలీవుడ్ లో లెజెండరీ దర్శకుల పేర్లు తీస్తే అందులో ఈవీవీ సత్యనారాయణ( Evv Satyanarayana ) కచ్చితంగా ఉంటాడు.వినోదాత్మక చిత్రాలను తియ్యడం లో ఈయనకి ఈయనే సాటి.
వినోదం ఉంటూనే హీరోల ఇమేజి కి తగ్గట్టు ఊర మాస్ ఎలిమెంట్స్ ని జోడించి సినిమాలు తియ్యడం ఈయన నుండే నేర్చుకున్నారు నేటి తరం దర్శకులు కూడా.అలాంటి లెజెండ్ కొడుకు ఇండస్ట్రీ లో హీరో గా ఎంట్రీ ఇస్తున్నాడు అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
ఆయన ఇద్దరు కొడుకులు అల్లరి నరేష్ మరియు ఆర్యన్ రాజేష్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు.కానీ అల్లరి నరేష్( Allari Naresh ) ఒక్కడే గ్రాండ్ సక్సెస్ అయ్యాడు.
ఆర్యన్ రాజేష్( Aryan Rajesh ) పలు సినిమాల్లో హీరో గా నటించి మెప్పించాడు కానీ, రెండు మూడు ఫ్లాప్స్ రాగానే మాయం అయిపోయాడు.కానీ అల్లరి నరేష్ ఇప్పటికీ అదే రేంజ్ డిమాండ్ తో కొనసాగుతున్నాడు.
మన ఇండస్ట్రీ లో కామెడీ హీరోలు ఎవరు అని అడిగితే అంతకు ముందు రాజేంద్ర ప్రసాద్ గారి పేర్లు చెప్పేవాళ్ళు.కానీ నేటి తరం లో మాత్రం అల్లరి నరేష్ పేరు చెప్తున్నారు.ఆ రేంజ్ లో ఆయన తన బ్రాండ్ ఇమేజి ని ఏర్పాటు చేసుకున్నాడు.కామెడీ సినిమాలకు( Comedy Movies ) కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన అల్లరి నరేష్, అప్పుడప్పుడు ‘గమ్యం ‘ లోని గాలి శ్రీను లాంటి హృదయాలకు హత్తుకునే సినిమాలు కూడా చేస్తుంటాడు.
ఇప్పుడు ఆయన కామెడీ సినిమాలకు దూరమై వరుసగా సీరియస్ సినిమాలు చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.అవి సక్సెస్ లు సాధిస్తున్నాయి కూడా.రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘ఉగ్రం’ చిత్రానికి( Ugram ) మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇప్పుడు ప్రస్తుతం ఆయన నాగార్జున తో కలిసి ‘నా సామీ రంగ’( Naa Saami Ranga ) అనే సినిమా చేస్తున్నాడు.
ఇకపోతే రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.తనకి సినిమాలు తప్ప మరో పని రాదనీ, నేను దేవుడిని ఏదైనా కోరుకోవాలి అనుకుంటే, నేను చనిపోయే వరకు సినిమాలు చేస్తూనే ఉండాలి అని కోరుకుంటా అంటూ అల్లరి నరేష్ ఎమోషనల్ గా మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.అల్లరి నరేష్ అలా ఎమోషనల్ గా మాట్లాడడం చూసి ఆయన అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.