Cricket: CSKకు షాకిచ్చిన జడేజా... ఈ సంచలన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో?

అవును, జడేజా CSKకు షాకిచ్చినట్టే అనిపిస్తోంది.చెన్నై సూపర్ కింగ్స్ కి జడేజా చేసిన సేవలు గురించి క్రికెట్ ప్రపంచానికి తెలిసినదే.

 All Rounder Ravindra Jadeja Good Bye To Csk Team-TeluguStop.com

ఇలాంటి తరుణంలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఈ సంచలనం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రవీంద్ర జడేజా గుడ్ బై చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి.

IPL 2022 సీజన్ లో జట్టు సారాధ్య బాధ్యతలు అందుకున్న జడేజా కాస్త తడబడ్డాడు.కెప్టెన్సీ అనుభవం కొత్త కారణంగా తీవ్ర ఒత్తిడికి గురై వ్యక్తిగతంగా కూడా ఘోరంగా విఫలమయ్యాడు.

జడేజా అభిమానులు మాత్రం అతనినుండి మెరుగైన ఆటకోసం ఆశపడ్డారు.ఇక ఏమైందో తెలియదు గాని బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ అలాగే చివరకు ఫీల్డింగ్ లో కూడా జడేజా ఇక్కడ రాణించలేకపోవడం బాధాకరమైన విషయం.

దీంతో కెప్టెన్సీ బాధ్యతులు మరలా ధోని చేతికి చిక్కాయి.ఈ విషయంలో జడేజా అభిమానులు కాస్త అసహనానికి గురయ్యారు.కానీ తప్పని సరి పరిస్థితులలో సదరు మేనేజ్ మెంట్ ఆలా చేయవలసి వచ్చింది.అంతేగాని దానివెనకాల మరే దురుద్దేశం లేదని ఓ ప్రెస్ మీట్ లో వారి పేర్కొనడం గమనార్హం.

Telugu Rounderravindra, Chennai, Jadeja, Jadeja Csk, Key, Latest, Mahendrasingh,

ఇక తాజాగా జడేజా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కు చెందిన పోస్టులన్నీ డిలీట్ చేశాడు.అదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయి కూర్చుంది.చెన్నైతో తెగ దింపులు చేసుకున్నాడంటూ కొన్ని మీడియాలు కోడై కూస్తున్నాయి.కాబట్టే ఆ జట్టుకు సంబంధించిన పోస్టులు డిలీట్ చేశాడని వాదన సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది.

ఈ తరుణంలో వచ్చే సీజన్ లో జడేజా చెన్నైకి ఆడటం కష్టమేనని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.అయితే దీనిపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రావాలని కోరుకుందాం.

అయితే ఓ వైపు ఈ విషయంలో అభిమానులు జడేజాకు మద్దతుగా నిలుస్తున్నారు.సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube