1.రెండు కోట్ల మద్యం బాటిళ్ల ధ్వంసం
తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తు కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద పట్టుబడిన రెండు కోట్ల రూపాయలు విలువైన 66 వేల మద్యం బాటిళ్లను పోలీసులు రోడ్డు రోలర్ ధర ధ్వంసం చేశారు.
2.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 18,257 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
3.కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే పార్టీ టికెట్లను కేటాయించాలని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.
4.అజ్ఞాతం లో మారేడుమిల్లి సీఐ
అత్యాచార ఆరోపణలు ఎదుర్కుంటున్న మారెడుమిల్లి సీఐ నాగేశ్వరరావు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు.ఆయనను అరెస్ట్ చేయాలంటూకాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు.
5.వరదలో చిక్కుకున్న బస్సు
తెలంగాణలోని కాటారం వద్ద కాళేశ్వరం గ్రావిటీ కెనాల్ వద్ద ఓ ప్రవేట్ ట్రావెల్ బస్సు వరద నీటిలో నిన్న రాత్రి నుంచి చిక్కుకుపోయింది.వరంగల్ నుంచి కాళేశ్వరం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
6.ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద వరద ఉదృతి
ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద వరద ఉద్ధృతి రోజురోజుకు తీవ్రమవుతోంది.దీంతో అప్రమత్తమమైన అధికారులు ప్రాజెక్టుకు ఉన్న 20 గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేశారు.
7.తెలంగాణలో స్కూళ్లకు మూడు రోజుల సెలవులు
తెలంగాణ లో భారీ వర్షాలు నేపథ్యంలో పాఠశాలలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.
8.పవన్ కళ్యాణ్ విమర్శలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.రేణిగుంట తారకనమా నగర్ లో ఓ కుటుంబానికి 2004 లో వైఎస్సార్ ప్రభుత్వం ఇంటిని ఇచ్చిందని , ఇప్పుడు సిటీ ఎంపిటిసి ఆ ఇంటిని లాక్కునేందుకు ప్రయత్నిస్తూ ఆ కుటుంబంపై తీవ్ర అసభ్య పదజాలంతో తిడుతూ వారిని వేధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, మీ ఇంట్లో ఆడవాళ్ళను తిడితే ఇలాగే ఊరుకుంటారా అంటూ వైసీపీ నాయకులను ఉద్దేశించి మండిపడ్డారు.
9.భారీ వర్షాలపై సిఎస్ సమీక్ష
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండడంపై చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
10.నవసందేహాలు అన్న వారు నవరంధ్రాలు మూసుకున్నారు
టిడిపి జనసేన నాయకులు వైసిపి రాజ్యసభ సభ్యుడు రెడ్డి విమర్శలు చేశారు.నవ సందేశాలు అంటూ విమర్శలు చేస్తున్నవారు ఇప్పుడు నవరంధ్రాలు మూసుకున్నారు అని వ్యాఖ్యానించారు.
11.ఘనంగా బక్రీద్
దేశవ్యాప్తంగా ఘనంగా బక్రీద్ వేడుకలు జరిగాయి.
12.రఘురామ కామెంట్స్

ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటన లో చిరంజీవి తప్ప అందరూ బాగా నటించారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.
13.అమర్నాథ్ యాత్రికుల బృందం క్షేమం
ఏపీ నుంచి అమర్నాథ్ వెళ్లిన ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని ఈ యాత్ర నిర్వాహకుడు వినోద్ తెలిపారు.మొత్తం ఏపీ నుంచి 34 మంది ఈ యాత్రికులు వెళ్లారు.
14.ప్రజా సమస్యలు పరిష్కరించాలి
ప్రజా సమస్యలను ఏపీ ప్రభుత్వం పట్టించుకుని వాటిని పరిష్కరించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.
15.బక్రీద్ శుభాకాంక్షలు చెప్పిన లోకేష్

ముస్లిం సోదర సోదరీమణులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు.
16.రెండో విడత జనవాణి
రెండో విడత జనవాణి కార్యక్రమాన్ని ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
17.చంద్రబాబు పై విజయసాయి విమర్శలు

టీడీపీ అధినేత చంద్రబాబు పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు.
18.నేడు గోల్కొండ బోనాలు
నేడు గోల్కొండ బోనాలు ప్రారంభం అయ్యాయి.దీనికి భారీగా ఏర్పాట్లు చేశారు.
19. షర్మిల పాదయాత్ర వాయిదా

వైఎస్సార్ టీపి అధినేత్రి షర్మిల పాదయాత్ర భారీ వర్షాల కారణంగా వాయిదా పడింది.
20.నేడు కేఏ పాల్ పర్యటన
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు.







