ప్రస్తుతం జపాన్ దేశంలోని అక్వేరియం నిర్వాహకులు పెంగ్విన్స్‌ను బతిమిలాడుతున్నారు.చేపలను వాటి నోటికి అందించి మరీ ఇదిగో తిను.అని ప్రాధేయ పడుతున్నారు.కానీ అవి మాత్రం “నాకొద్దు, పో” అని తెగ ఈసడించుకుంటున్నాయి.దీంతో ఏం చేయాలో తెలియక జపనీయులు తలలు పట్టుకుంటున్నారు.నిజానికి పెంగ్విన్స్ చేపలను ఇష్టపడి తింటాయి.
అయితే 30,000 కంటే ఎక్కువ సముద్ర జీవులకు నిలయమైన హకోన్-ఎన్ అక్వేరియంలోని పెంగ్విన్స్ మాత్రం చేపలను ముట్టుకోను కూడా ముట్టుకోవడం లేదు.ఎందుకు తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే.
ప్రస్తుతం జపాన్‌లో ద్రవ్యోల్బణం తారా స్థాయికి చేరుకుంది.అక్కడి నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి.దీంతో అక్వేరియం నిర్వాహకులు జంతువుల ఆకలిని తీర్చేందుకు తక్కువ ధరకు వచ్చే ఫుడ్ కొనుగోలు చేస్తున్నారు.ధరలు తక్కువగా ఉన్నప్పుడు గతంలో ఓటర్స్(Otters-నీటి కుక్కలు), పెంగ్విన్స్‌కి వీరు జపనీస్ హార్స్ మ్యాకెరెల్ చేపలు ఆహారంగా అందించేవారు.
అయితే ఇప్పుడు ఆ రకం చేపల రేటు విపరీతంగా పెరిగిపోయింది.దాంతో చేసేది లేక తక్కువ రేటులో లభించే సాబా అనే మాములు మ్యాకెరెల్ రకం చేపలను పెంగ్విన్స్‌కి అందించే ప్రయత్నం చేశారు.
కానీ ఈ పెంగ్విన్స్ మాత్రం తమకు హార్స్ మ్యాకెరెల్ చేపలే కావాలని మారాం చేస్తున్నాయి.ఈ చీప్ చేపలు మా అక్కర్లేదు అన్నట్టు అవి మొహం తిప్పుకుంటున్నాయి.
నోటికి అందిస్తే వాటిని కింద పడేస్తున్నాయి.

అయితే ఆక్వేరియం ఇబ్బంది తెలివిగా ఆలోచించి తక్కువ రేటుతో వచ్చే చేపలపై హార్స్ మ్యాకెరెల్ చేపల మాంసాన్ని పూసి వాటికి అందిస్తున్నారు.దాంతో ఇవి టెంప్ట్ అయి తింటున్నాయని అంటున్నారు.కొన్ని మాత్రం ఇప్పటికీ నిరాకరిస్తూ వారిని ముప్పతిప్పలు పెడుతున్నాయి.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారగా.అది చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.
ఇవి చిన్న పిల్లలు మారాం చేసినట్టు బలే మారం చేస్తున్నాయ్ గా అని మరికొందరు ఆశ్చర్యపోతున్నారు.







