తారకరత్న( Tarakaratna ) మరణం తర్వాత తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి( Alekhya Reddy ) ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.కన్నీళ్లు పెట్టించేలా ఉన్న ఆ పోస్ట్ తారకరత్న అభిమానులను కదిలిస్తోంది.
భర్త మరణం ఆమెను ఇంకా బాధ పెడుతోందని అలేఖ్య పోస్ట్ చూస్తే అర్థమవుతోంది.మన పిల్లల కొరకు నేను ఇంకా ఇలా స్ట్రాంగ్ గా ఉండటానికి ప్రయత్నిస్తున్నానని ఆమె తెలిపారు.
కానీ నా వరకు నువ్వే నా బలం అని ఆమె చెప్పుకొచ్చారు.నువ్వు నాకు కావాలి నాన్నా అంటూ ఆమె చెప్పుకొచ్చారు.నేను బాధ పడుతున్నానని ఒంటరిగా ఉన్నానని అలేఖ్యారెడ్డి చెప్పుకొచ్చారు.నేను ఓటమిలో ఉన్నానని పైకి లేపేందుకు నువ్వు కావాలని ఆమె కామెంట్లు చేశారు.
నేను వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన రోజు వస్తుందని నేను అనుకోలేదని అలేఖ్యారెడ్డి వెల్లడించడం గమనార్హం.
నువ్వెప్పుడూ పైనుంచి నన్ను చూస్తూనే ఉంటావని నాకు తెలుసని నీకోసం నా గుండెల్లోంచి రక్తం కారుతోంది బంగారు అని ఆమె అన్నారు.ఇలాంటి గందరగోళంలో నువ్వు నా తోడు లేదని బాధ ఉందని ఆమె చెప్పుకొచ్చారు.అలేఖ్యారెడ్డి చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
అలేఖ్యారెడ్డి కుటుంబానికి బాలయ్య( Balakrishna ) తన వంతు సహాయం చేస్తున్నారని తెలుస్తోంది.
అలేఖ్యారెడ్డి రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించడంతో పాటు ఒక్కో మెట్టు పైకి ఎదగాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అలేఖ్యారెడ్డి కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో తెలియాల్సి ఉంది.అలేఖ్యారెడ్డిని అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
అలేఖ్యారెడ్డి కుటుంబానికి నందమూరి ఫ్యామిలీ( Nandamuri Family ) నుంచి మరింత సహాయసహకారాలు అందితే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అలేఖ్యారెడ్డికి తాము ఎప్పుడూ అండగా ఉంటామని ఫ్యాన్స్ చెబుతున్నారు.