నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి( Nirmal Government Hospital ) వద్ద ఉద్రిక్తత నెలకొంది.ఆస్పత్రి ప్రాంగణంలో విద్యార్థి సంఘాలు ఆందోళన కార్యక్రమం చేపట్టాయి.
బాసర ట్రిపుల్ ఐటీ( Basara IIIT )లో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి అరవింద్ మృతిపై సమగ్ర విచారణ జరిపిన తరువాతే పోస్టుమార్టం నిర్వహించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.ఈ క్రమంలోనే విద్యార్థి మరణం ప్రభుత్వ హత్యంటూ ఎస్ఎఫ్ఐ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
అయితే బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న అరవింద్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే.