పుట్టిన రోజు అర్థాన్నే మార్చేసారుగా ఈ తండ్రీకొడుకులు..!

ఈ మధ్య సోషల్ మీడియా పుణ్యమా అంటూ కొందరు వ్యక్తులు వారి పుట్టినరోజు సందర్భంగా అనేక మంచి పనులు చేస్తూ.ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

 These Father And Sons Have Changed The Meaning Of Birthday, Viral Video, Social-TeluguStop.com

మనలో చాలామంది పుట్టినరోజు నాడు ఉదయాన్నే లేచి తల స్నానం చేసి మనవారు తెచ్చిన కొత్త బట్టలు వేసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని రోజును మొదలు పెడతాము.ఇక పిల్లల విషయంలో.

కేక్ కట్ చేసి, ఫ్రెండ్స్ కు, అలాగే చుట్టుపక్కల ఇళ్ల వారికి చాక్లెట్లు ఇస్తూ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు.మామూలుగా ఇది ప్రతి చోట జరిగే సంగతే.

డబ్బున్న వాళ్ళైతే వారి ఇళ్లలో కాస్ట్లీ గిఫ్టులు, కాస్ట్లీ పార్టీలు జరుపుకుంటూ హంగామా చేసేస్తున్నారు.అయితే ఇలా సంవత్సరంలో ఒకరోజు చేసుకోవడంలో ఎటువంటి తప్పులేదు.

కాకపోతే., ఎదుటివారికి ఇబ్బంది కలగనంతవరకు ఇది ఓకే.ఇకపోతే ఈమధ్య కొంతమంది మనుషులకి సహాయం చేస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో సంబంధించి వివరాలు చూస్తే.

Telugu Fater, Changed, Umbrella, Latest-Latest News - Telugu

ఓ పిల్లోడు తన పుట్టినరోజు సందర్భంగా తన తండ్రితో కలిసి వెళ్లి రోడ్డుపై మండు వేసవిలో పూలు అమ్ముకుంటున్న ఓ వృద్ధ మహిళ వద్దకు చేరుకొని ఆమెకు కొత్త గొడుగు తోపాటు, కొత్త దుస్తులు ( new umbrella , a new dress )కూడా ఇచ్చాడు.దీనితో ఆ బామ్మా కల్మషం లేని చిరునవ్వుతో చిన్నోడిని ఆశీర్వదిస్తూ దీవెనలను అందించింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.

సోషల్ మీడియా నెటిజన్స్ తల్లి కొడుకులని ఇద్దరినీ పొగడ్తలతో ముంచేత్తుతున్నారు.

Telugu Fater, Changed, Umbrella, Latest-Latest News - Telugu

పెంపకం అంటే ఇలా ఉండాలంటూ నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.మరికొందరైతే ఈసారి తన పుట్టినరోజును ఇలాగే జరుపుకుంటా అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.ఇంకొందరు డియర్ బర్త్డే బాయ్ నువ్వు సంతోషంగా.

ఇలాగే 100 పుట్టినరోజులు జరుపుకోవాలని విష్ చేస్తున్నారు.నిజంగా ఒక్కోసారి మనం స్వతహాగా సంతోష పడడం కంటే.

మన వల్ల ఇతరులు సంతోషం పొందుతే మనకు వచ్చే కికే వేరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube