పసుపు.( Turmeric ) దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.
దుంప జాతికి చెందిన పసుపు వంటల్లో వాడే ముఖ్య మసాలా దినుసుల్లో ఒకటి.పసుపులో అనేక ఔషధ గుణాలు నిండి ఉంటాయి.
అందువల్ల ఆయుర్వేద వైద్యంలోనూ పసుపును ఉపయోగిస్తారు.అలాగే ప్రతిరోజు ఖాళీ కడుపుతో పసుపు నీళ్లు తాగితే శరీరంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పసుపు నీళ్లు అంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.

ఒక గ్లాస్ గోరు వెచ్చని వాటర్ ను తీసుకొని అందులో పావు టేబుల్ స్పూన్ పసుపును వేసి బాగా కలిపి తాగేయడమే.ఉదయం ఖాళీ కడుపుతో ఒక్క గ్లాస్ పసుపు వాటర్( Turmeric Water ) ను తీసుకుంటే శరీరంలో ఉండే విషపదార్థాలన్నీ బయటకు పోతాయి.దాంతో అంతర్గతంగా బాడీ శుభ్రంగా మారుతుంది.
అలాగే చాలా మంది మోకాళ్ళ నొప్పులతో తీవ్రంగా సతమతమవుతుంటారు.మోకాళ్ల నొప్పుల కారణంగా నడవడానికి, నిలబడడానికి ఎంతో ఇబ్బంది ఇబ్బంది పడుతుంటారు.
ఈ క్రమంలోనే మోకాళ్ల నొప్పుల( Knee Pains ) నుంచి విముక్తి పొందడం కోసం ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.
అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి పసుపు నీళ్లు అద్భుతంగా సహాయపడతాయి.
ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ పసుపు నీళ్లు తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ వాపులు నయం అవుతాయి.ఇటీవల రోజుల్లో క్యాన్సర్( Cancer ) కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.
క్యాన్సర్ వచ్చే రిస్క్ ను తగ్గించడానికి పసుపు నీళ్లు హెల్ప్ చేస్తాయి.

అవును రెగ్యులర్గా ఖాళీ కడుపుతో పసుపు నీళ్లు తాగితే శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.రోజు పరగడుపున పసుపు కలిపిన వాటర్ ను తీసుకుంటే రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులు తొలగుతాయి.దాంతో గుండెపోటు తో సహా వివిధ రకాల గుండె సంబంధిత జబ్బులు( Heart Problems ) వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
అంతేకాదు పసుపు వాటర్ ను తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.చర్మం సైతం కాంతివంతంగా ప్రకాశవంతంగా మెరుస్తుంది.







