లగ్జరీ కారు కొన్న అదితి రావు.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందం నటనతో మెప్పిస్తుంది హీరోయిన్ అదితి రావు హైదరి.తెలుగు తమిళ,హిందీ తదితర భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.

 Aditi Rao Hydari Buys New Audi Q7 Car Worth 90 Lakhs Details, Aditi Rao Hydari,-TeluguStop.com

ఇటీవలే హీరో శర్వానంద్ నటించిన మహా సముద్రం సినిమాతో అలరించిన విషయం తెలిసిందే.ఈ సినిమా అనుకున్న విధంగా వచ్చేసిన సాధించలేకపోయిన అప్పటికీ హీరోయిన్ అదితి రావుకు మాత్రం మంచి గుర్తింపు దక్కింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక విలాసవంతమైన కారును కొనుగోలు చేసింది.అయితే ఆ కార్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా అదితి రావు హైదరి ముంబైలో అత్యంత ఖరీదు చేసే ఆడి క్యూ 7 లగ్జరీ కారును కొనుగోలు చేసింది.అయితే ఆ కారు ఖరీదు దాదాపుగా 90 లక్షలు ఉంటుంది అని అంచనా.

అదితి రావు ఆ కారు కొనుగోలు చేసినట్టుగా ఆడి కంపెనీ తన సోషల్ మీడియా హ్యాండిల్ లో పలు ఫోటోలతో పోస్ట్ చేసింది.కారుతో అదితిరావు కలిసి దిగిన అందమైన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ఆ ఫోటోలను చూసిన అభిమానులు అదితిరావు కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇంకొందరు మాత్రం ఆ కారు ఖరీదు తెలిసి నోరెళ్ళ బెడుతున్నారు.కాకపోతే అదితి రావు హైదరి 2007లో విడుదల అయిన శృంగారం అనే ఒక తమిళ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఆ తరువాత సమ్మోహనం,వి, మహా సముద్రం, హై సినామిక, రాక్ స్టార్, మర్డర్ 3, వజీర్, ది గర్ల్ ఆన్ ది ట్రైన్ ఇలాంటి సినిమాల్లో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది.

ఇక సినిమాలలో తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తు ఉంటుంది అదితి రావ్. ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube