సినిమా ఇండస్ట్రీలో పైకి నవ్వుతూ కనిపించే సెలబ్రిటీల నవ్వుల వెనుక ఎన్నో రకాల కష్టాలు బాధలు అవమానాలు ఉన్నాయి.తెర వెనుక ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఒక్కసారి తెర ముందుకు వచ్చారు అంటే చాలు ఆ కష్టాలు బాధలు అని మరిచిపోయి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
అలా సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి స్టార్ డం లో ఉన్నవారు ఒకప్పుడు వారు వారి ఫ్యామిలీ లతో అనేక కష్టాలను ఇబ్బందులను ఎదుర్కొన్నారు.అలా ఆ సెలబ్రిటీలు ఎప్పుడైనా ఇంటర్వ్యూలలో లేదంటే ఏదైనా ప్రమోషన్స్ కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు బయట పెడితే తప్ప వారు ఎదుర్కొన్న కష్టాల గురించి మనకు తెలియదు.

అలా హీరోయిన్ రవళి( Heroine Ravali ) అలాగే హరిత అమ్మగారు కూడా ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొన్నారట.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో కష్టాల గురించి చెబుతూ బాధపడింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.విజయ దుర్గ( Vijaya Durga ) అంటే ఎవరెవరో కాదు హీరోయిన్స్ రవళి, హరిత అమ్మగారు.కానీ ఈ విషయం మనలో చాలామందికి తెలియదు.అయితే విజయ దుర్గ గారికి 14 ఏళ్లకే పెళ్లి కావడంతో ఆ తర్వాత ముగ్గురు పిల్లలతో కలిసి ఆమె చెన్నైకి అనుకోకుండా వెళ్లాల్సి వచ్చిందట.
ఇక చెన్నైకి ( Chennai ) వెళ్ళినప్పుడు ఆమె ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొందట.

మొదట తన కొడుకుని సినిమా ఇండస్ట్రీకి పంపించిన విజయదుర్గ ఆ తర్వాత తన కూతుర్లు అయినా హరిత, రవళిని కూడా అనుకోకుండా సినిమా ఇండస్ట్రీకి పంపించిందట.ఆమె కొడుకు బట్టలు కొనుక్కోవడానికని 800 రూపాయలు ఇస్తే చెన్నైకి వచ్చి సినిమా పై ఉన్న మక్కువతో డాన్స్ నేర్చుకోవడానికి అని వెళ్లి అలా ఎన్నో కష్టాలను ఎదుర్కొని సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చాడట.ఆ తర్వాత ఆమె కూడా తన ఇద్దరు కూతుర్లను తీసుకొని చెన్నైకి వెళ్లి అక్కడే ఉంటూ చాలా రకాల కష్టాలను ఎదుర్కొందట.
కాగా విజయ దుర్గ వయసు ప్రస్తుతం 70 సంవత్సరాలు.దీంతోపాటు ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలను ఇంటర్వ్యూలో పంచుకుంది విజయ దుర్గ.