తెలుగులో మంచి సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న “సీనియర్ హీరోయిన్ సుహాసిని” గురించి సినీ ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ మధ్యకాలంలో నటి సుహాసిని అమ్మ, అక్క, వదిన తదితర పాత్రలలో నటిస్తూ బాగానే అలరిస్తోంది.
అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో సుహాసిని పాల్గొంది. ఇందులో భాగంగా తన సినీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.
అయితే ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తనని కాపాడడం కోసం అప్పట్లో చేసినటువంటి ఓ సాహసం గురించి గుర్తు చేసుకుంది.గతంలో ఒకసారి తాను మరియు తనతో పాటూ నటిస్తున్న పలువురు చిత్ర యూనిట్ సభ్యులు ఓసారి షూటింగ్ పూర్తి చేసుకొని రాత్రి సమయంలో ఇంటికి వెళ్తున్నప్పుడు కొంతమంది ఆకతాయిలు పీకల దాకా మద్యం సేవించి తమపై మద్యం బాటిళ్లను మరియు రాళ్లతో విసురుతూ దాడి చేసారని, ఈ విషయం గమనించిన మెగాస్టార్ చిరంజీవి వెంటనే కారులోంచి దిగి తన తుపాకీతో వారిని బెదిరించి అక్కడి నుంచి తరిమేశాడని తెలిపింది.
అలాగే మెగాస్టార్ చిరంజీవి రియల్ లైఫ్ హీరో అంటే సరదాగా గా చెప్పు వచ్చింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సుహాసిని పలు బాలీవుడ్ చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.
అలాగే తన భర్త మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న చిత్ర పనులను కూడా చక్కబడుతుంది.మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న “ఆచార్య” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.