పసిపాపలా అల్లరి చేస్తున్న సాయి పల్లవి.. ఫోటో వైరల్!

మనలో ఒక్కోసారి చిన్నారి తనం బయట పడుతుంది.చిన్నగా చిరుజల్లు పడుతున్న వేళ.

 Actress Sai Pallavi Latest Cute Photo Viral On Social Media Details, Sai Pallavi-TeluguStop.com

లేదంటే సెలయేళ్ళు పారుతున్న సమయంలో మన మనసు ఒక్కసారిగా హాయిగా మారుతుంది.మనలోని చిన్న పిల్ల బయటకు వచ్చి ఆ నీళ్లలో అల్లరి చేయాలనీ మనసు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది.

కరెక్ట్ గా అలాగే సాయి పల్లవి కి కూడా తన మనసు చిన్నారి గా మారిపొమ్మని చెప్పిందట.

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి చేసేది కొన్ని సినిమాలు అయినా కూడా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.

ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత ఇటీవలే రిలీజ్ అయిన లవ్ స్టోరీ సినిమాతో మరొకసారి అందరి మనసులను దోచేసింది.ఈమె సినిమాలో నటిస్తే చాలని చాలా మంది హీరోలు అనుకుంటున్నారు అంటే ఆమెకు ఎంత క్రేజ్ పెరిగిందో తెలుస్తుంది.

రీసెంట్ గా సాయి పల్లవి నాని హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇందులో కోల్ కత్తా యువతిగా.దేవదాసీ పాత్రలో నటించి మెప్పించింది.

ఈ సినిమాలోని ఈమె నటన మరొకసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ సినిమాలోని ప్రణవాలయ సాంగ్ లో చేసిన డ్యాన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.డిసెంబర్ 24న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని మంచి వసూళ్లు రాబడుతుంది.

ఇక 2021లో మరొక హిట్ తన ఖాతాలో వేసుకున్న సాయి పల్లవి ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంది.ఒక సాధారణ యువతిలా స్విమ్మింగ్ ఫూల్ వద్ద చిన్న పాపలా మారిపోయి ఆడుకుంటూ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది.సాయి పల్లవి షేర్ చేసిన ఈ ఫోటోకు ”గుండె లోతులో ఉన్న పసి హృదయాన్ని తాకింది” అనే క్యాప్షన్ ఇచ్చింది.ఈ ఫోటో ప్రెసెంట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube