ప్రియాంక నన్ను లవ్ చేసింది.. నేను ఆమె ఫీలింగ్స్ కి రెస్పెక్ట్ ఇచ్చాను: సీక్రెట్ రివీల్ చేసిన మానస్

బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలామంది జీవితాలు మారిపోయాయి.బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత చాలా మంది మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు ఇండస్ట్రీలో మంచి మంచి అవకాశాలతో దూసుకుపోతున్నారు.

 Bigg Boss 5 Telugu Finalist Maanas Opens Up On His Relationship With Priyanka Si-TeluguStop.com

ఇంకొంతమంది అయితే ఎంతో క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అనంతరం నెగిటివిటిని మూటగట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.ఇకపోతే ఇటీవలే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ షో ముగిసిన విషయం అందరికి తెలిసిందే.

ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులు చీ కొట్టిన కంటెస్టెంట్ లు చాలామంది ఉన్నారు.

ఇందులో సిరి, షణ్ముఖ్, ఆని మాస్టర్, ఉమాదేవి ఇలా చాలామంది ఉన్నారు.

ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ మానస్ బయటకు వచ్చినప్పుడు జెన్యూన్ పర్సన్ అనే పేరును సంపాదించుకొని వచ్చాడు.మనసులో ఏది ఉంటే అది నిర్మొహమాటంగా బయటికి కుండ బద్దలు కొట్టినట్టు గా మాట్లాడే మనస్తత్వం ఉండటంతో మానస్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు.

ఇకపోతే మానస్ కు అంతో ఇంతో నెగిటివిటీ వచ్చింది అంటే  అది కేవలం ప్రియాంక వల్లే అని కొందరు అంటున్నారు.ఇంకొందరు ప్రియాంక కి బ్యాడ్ నేమ్ రావడానికి మానస్ కారణం అని అంటున్నారు.

హౌస్ లో ప్రియాంక మానస్ ని అమితంగా ఇష్టపడింది.కానీ మానస్ ఆమెను దూరం పెట్టేవాడు.

Telugu Biggboss, Manas, Priyanka Singh, Ship, Tollywood-Movie

ఇక బిగ్ బాస్ కూడా వీళ్ల మధ్య లవ్ ట్రాక్ నడిపించడానికి గట్టిగానే ప్రయత్నాలు చేశాడు.కానీ 13వ వారం లో ప్రియాంక ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది.ఇదిలా ఉంటే తాజాగా మానస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రియాంక గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.ప్రియాంక నన్ను ఇష్ట పడుతుంది అన్న విషయం నాకు అర్థం అయింది.

నేను ఆమె ఫీలింగ్స్ ని గౌరవిస్తాను.చాలామంది ప్రియాంకను సిస్టర్ అని పిలుస్తూ చేతులు దులిపేసుకున్నారు.

ఇక రెండవ రోజు హౌస్ లో మానస్, శ్రీ రామచంద్ర తప్ప మిగిలిన వాళ్ళందరిని అన్నయ్య గానే ట్రీట్ చేస్తా అని చెప్పింది ప్రియాంక.ఆ సమయంలో నేను, శ్రీరామ్ కూడా ఆమె ఫీలింగ్స్ ని గౌరవించాం.

అందరిలాగే నేను కూడా ప్రియాంక ని సిస్టర్ అని వరుస కలిపితే ఆమె ఫీలింగ్స్ ని హర్ట్ చేసినట్టవుతుంది.అందుకే ప్రియాంక ని కూర్చోబెట్టి లిమిట్ క్రాస్ చేస్తే ప్రశ్నిస్తాను అని క్లియర్ గా చెప్పాను.

అలాంటి సందర్భాలు చాలానే వచ్చాయి అని మానస్ చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube