టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన మీనా గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఎంతోమంది స్టార్ హీరోలకు జోడీగా నటించి మీనా ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నారు.
అయితే తాజాగా నటి మీనా ఇంట విషాదం చోటు చేసుకుంది.నిన్న రాత్రి మీనా భర్త విద్యాసాగర్ మృతి చెందారు.
పోస్ట్ కోవిడ్ సమస్యల వల్లే ఆయన మరణించారని సమాచారం అందుతోంది.
కరోనా నుంచి కోలుకున్న తర్వాత శ్వాసకోశ సమస్యలు వేధించాయని గత కొన్ని నెలలుగా చికిత్స తీసుకుంటున్న విద్యాసాగర్ కోలుకోలేక మృతి చెందారని తెలుస్తోంది.2009 సంవత్సరంలో మీనా విద్యాసాగర్ వివాహం జరిగింది.మీనా విద్యాసాగర్ లకు ఒక పాప కాగా ఆ పాప పేరు నైనిక అని సమాచారం.
ఈ ఏడాది జనవరి నెలలో మీనా కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డారు.కరోనా నెగిటివ్ వచ్చినా విద్యాసాగర్ ను మాత్రం ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధించాయి.
విద్యా సాగర్ బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్, బిజినెస్ మేన్ అని సమాచారం.కరోనా సోకక ముందే ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారని బోగట్టా.
కరోనా సోకిన తర్వాత సమస్య మరింత ఎక్కువైందని తెలుస్తోంది.ఊపిరితిత్తుల ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలనుకున్నా ఆయనకు సూట్ అయ్యే లంగ్స్ దొరకలేదని బోగట్టా.
భర్త మృతితో మీనా శోకసంద్రంలో మునిగిపోయారు.

మరోవైపు మీనా ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.దృశ్యం, దృశ్యం2 సినిమాలు నటిగా మీనాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.విజయ్ హీరోగా నటించి సక్సెస్ ను సొంతం చేసుకున్న తేరి సినిమాలో నైనిక కీలక పాత్రలో నటించారు.
సోషల్ మీడియా వేదికగా పలువురు టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు ప్రముఖ నటి మీనా భర్త మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.