సుడిగాలి సుధీర్ ను చాలా మిస్ అయ్యాను.. అవుతున్నాను.. నటి ఇంద్రజ కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ నటి, సీనియర్ హీరోయిన్ ఇంద్రజ గురించి మనందరికీ తెలిసిందే.ఒకప్పుడు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఇంద్రజ, అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

 Actress Indraja Emotional Wordss About Sudigali Sudheer,sudigali Sudheer,indraja-TeluguStop.com

ఇకపోతే ఈ మధ్యకాలంలో సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టిన ఇంద్రజ ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.కామెడీ షో లకు జడ్జిగా వ్యవహరిస్తూ అప్పుడప్పుడు మధ్యమధ్యలో తనదైన శైలిలో కూడా పంచులు వేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది ఇంద్రజ.

అయితే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినప్పుడు అప్పుడప్పుడు గెస్ట్ గా వచ్చిన ఇంద్రజ ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి ఫుల్ టైం జడ్జిగా మారిపోయింది.ఇటీవలే ఆ షో నుంచి తప్పుకున్న ఇంద్రజ ప్రస్తుతం జబర్దస్త్ లో రోజా ప్లేస్ లో జడ్జిగా వ్యవహరిస్తోంది.

ఇదిలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంద్రజ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.ఇంటర్వ్యూ లో భాగంగా ఇంద్రజ మాట్లాడుతూ.

ఎవరి వ్యక్తిగత విషయాల గురించి తాను మాట్లాడానని, తన గురించి ఏదైనా చెబుతానని తనకు తెలియదని చెప్పనని, తెలిసినా కూడా చెప్పను అని స్పష్టం చేశారు ఇంద్రజ.

Telugu Show, Indraja, Jabardasth, Kevvu Karthik, Sridevidrama, Tollywood-Movie

జబర్దస్త్ లో నుంచి సుడిగాలి సుదీర్ వెళ్లిపోవడంతో చాలా మిస్ అయ్యాను అని తెలిపారు ఇంద్రజ.ఎక్స్ ట్రా జబర్దస్త్ షో నుంచి సుడిగాలి సుదీర్ వెళ్లిపోవడం పై కెవ్వుకార్తిక్ ఒక స్కిట్ చేశాడు కార్తీక్ సుధీర్ లాగా స్పెడ్స్ పెట్టుకునే సమయంలో ఒక్కసారిగా కన్నీళ్లు ఆపుకోలేకపోయాను.సుధీర్ నేను ముద్దుగా సిద్దు అని పిలుస్తాను చాలా మిస్ అయ్యాను.

సుధీర్ నన్ను ప్రేమగా రాజీ అని పిలుస్తాడు.అతను అమ్మ అని పిలవడంలో చాలా హ్యాపీగా ఉంటుంది.

నాకు కూడా అమ్మ అనిపించుకోవడం చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది ఇంద్రజ.అలాగే కమెడియన్ ప్రవీణ్ కూడా నాకు దేవుడు ఇచ్చిన కొడుకు చాలా మంచి అబ్బాయి అతనికి గిఫ్ట్ గా వాచ్ కూడా ఇచ్చాను అని ఇంద్రజ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube