కొంతమంది ఆర్టిస్టులలో అసలేంటో అర్థం కాదు సడన్గా మార్పు వస్తూ ఉంటుంది.మొదట వస్త్రధారణ విషయంలోనే మార్పు కనిపిస్తూ ఉంటుంది.
అంటే ఒకప్పుడు పద్ధతిగా ఉన్నవాళ్లు ఇప్పుడు పద్ధతిని మర్చిపోయి మోడ్రన్ గా తయారవ్వడం వంటివి.ఇప్పటికే చాలామంది ఆర్టిస్టులలో ఇటువంటి మార్పులు కనిపించాయి.
దీంతో జనాలు ఎప్పటికప్పుడు వారు మార్పు గురించి ప్రశ్నలు వేస్తూ ఉంటారు.అయితే తాజాగా హరితేజ ( Hariteja ) విషయంలో కూడా ఇదే ఎదురయ్యింది.
ఇక ఆమె ఏమని సమాధానం చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం.
బుల్లితెరపై, వెండితెరపై ఆర్టిస్టుగా మంచి పేరు సంపాదించుకుంది హరితేజ.
తొలిసారిగా ఆడవారి మాటలకు అర్ధాలే వేరు సినిమాతో వెండితెరకు పరిచయం కాగా.ఆ తర్వాత ఎన్నో అవకాశాలు అందుకుంది.
బుల్లితెరకు మనసు మమత సీరియల్ తో( Manasu Mamatha Serial ) ఎంట్రీ ఇవ్వగా.ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి మరింత ఫాలోయింగ్ పెంచుకుంది.
అంతేకాకుండా బుల్లితెర లో పలు షోలలో కూడా యాంకరింగ్ చేసింది.
ఆ తర్వాత 2017 లో ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో( Bigg Boss ) మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది.
చివరికి వరకు హౌస్ లో ఉంటూ మూడవ స్థానంలో నిలిచింది.బిగ్ బాస్ తర్వాత పలు సినిమాలలో కూడా నటించింది హరితేజ. ఇక మంచి ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన సమయంలో పెళ్లి చేసుకోగా.ఒక పాపకు జన్మనిచ్చింది.
ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది హరితేజ.

సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ బాగా రచ్చ రచ్చ చేస్తుంది.తన వ్యక్తిగత విషయాలను, ఫోటోలను బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడు తను జిమ్ లో చేసిన వర్కౌట్ వీడియోలను కూడా పంచుకుంటుంది.
ఇక తన భర్త తో చేసే రీల్స్ కూడా షేర్ చేసుకుంటూ తెగ లైకులు సంపాదించుకుంటుంది.

గత కొన్ని రోజుల నుండి ఈమె వేషధారణ పూర్తిగా మారిపోయింది.ఒక మంచి సంప్రదాయం ఉన్న కుటుంబమని మర్చిపోయి ఆచారాలను పక్కకు పెట్టేసి పొట్టి పొట్టి బట్టలు వేయటం మొదలు పెట్టింది.ఎప్పుడైతే ఈమె అందాల ఆరబోత మొదలుపెట్టిందో.
అప్పటినుంచి ఈమె పై ఉన్న అభిమానాన్ని వదులుకున్నారు ఫ్యాన్స్.మిమ్మల్ని ఎప్పుడూ ఇలా చూడాలి అనుకోలేదు అంటూ ఆమెకు తగిలేటట్టు కామెంట్లు కూడా చేస్తూ ఉంటారు.

అయినా కూడా వాటిని పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు ప్రవర్తిస్తుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టింది హరితేజ. అందులో వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఓపికగా సమాధానం చెబుతూ కనిపించింది.అయితే ఒక నెటిజన్ తనను మనసు మమత సీరియల్ నుండి ఫాలో అవుతున్నాను అంటూ కానీ ఇప్పుడేందుకు నీలో డ్రెస్ సెన్స్ లో మార్పు వచ్చిందని ప్రశ్నించారు.
దాంతో హరితేజ స్పందిస్తూ.తను ఎప్పుడు కొత్త కొత్తగా ఉండాలి అని అనుకుంటున్నాట.అందుకే మారుతూ ఉంటుందట.మార్పు చాలా మంచిది.
మార్పు అనేది కావాలి అని తెలుపగా ప్రస్తుతం ఆమె పంచుకున్న స్టోరీ బాగా వైరల్ అవుతుంది.