ప్రస్తుతం మలయాళ సినిమా ఇండస్ట్రీతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు నటుడు వినాయకన్.( Actor Vinayakan ) తాజాగా నటుడు వినాయకన్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం సంచలనంగా మారింది.
తాజాగా వినాయకన్ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ ఇక మీద తనకి తన భార్యకి ఎటువంటి సంబంధం లేదని, వారి వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ట్వీట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది.
కాగా నటుడు వినాయకన్ తెలుగు, మలయాళం, హిందీ,తమిళ ప్రేక్షకులకు సుపరిచితమే.
కాగా వినాయకన్ ఎక్కువగా విలన్ పాత్రలో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే.ఇక తెలుగులో కళ్యాణ్ రామ్ నటించిన అసాధ్యుడు ( Asadhyudu ) సినిమాలో రెండో విలన్ గా నటించారు.కాగా వినాయకన్ బబిత ( Babitha ) అనే బ్యాంకు ఉద్యోగిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇకపోతే గత ఏడాది వినాయకన్ తనకు ఇప్పటి వరకూ 10 మంది మహిళలతో శారీరక సంబంధం ఉంది అంటూ అప్పట్లో సంచలన కామెంట్స్ సంగతి మనందరికీ తెలిసిందే.అది కాస్తా వివాదానికి దారి తీయడంతో క్షమాపణలు కూడా చెప్పారు.
ఇప్పుడు భార్యతో విడాకుల వ్యవహారంతో మరోసారి వార్తల్లో నిలిచారు.
అయితే ఏడాది క్రితం మహిళలతో సంబంధం ఉంది అని చెప్పడమే ఈ డైవర్స్ కి కారణమై ఉండవచ్చునని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మహిళలతో సంబంధం విషయంలో ఆయన భార్యకు, ఆయనకు మధ్య గొడవ జరిగి ఉండవచ్చని, అందుకే విడాకులు ( Divorce ) తీసుకొని విడిపోయి ఉంటారు అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా ఒక ప్రముఖ నటితో ఎఫైర్ నడుపుతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదే విషయం గురించి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.