ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొలది రాజకీయం రసవత్తరంగా సాగుతోంది.ఏపీలో ప్రధాన పార్టీలు ఇప్పటికే రకరకాల కార్యక్రమాలతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
వైసీపీ ( YCP) తరపున అధ్యక్షుడు సీఎం జగన్ “సిద్ధం” ( Siddam )సభలతో హోరెత్తిస్తున్నారు.ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో మూడో “సిద్ధం” సభ జరిగింది.
ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున జనాలు హాజరయ్యారు.ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు “రా కదలిరా” సభలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రజాక్షేత్రంలో రావడానికి సిద్ధపడుతున్నారు.పరిస్థితి ఇలా ఉంటే సినిమా సెలబ్రిటీలు రకరకాల పార్టీలలో జాయిన్ అవుతున్న సంగతి తెలిసిందే.
పరిస్థితి ఇలా ఉండగా తాజాగా నటుడు సుమన్( Suman ) టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు తనకు రాజకీయ గురువు అని అన్నారు.గుంటూరు జిల్లా బాపట్ల ఎంపీగా పోటీ చేయాలని అప్పట్లో అవకాశం ఇచ్చినట్లు తెలిపారు.తనపై నమ్మకంతో ఎంపీ చేయాలనుకున్నారని అందుకు ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నట్లు స్పష్టం చేశారు.
తిరుపతిలో సుమన్ మాట్లాడుతూ.సీట్ల సర్దుబాటు సరిగ్గా జరిగితే టిడిపి జనసేన గెలుపు ఖాయమని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికలలో ప్రజలు ప్రలోభాలకు గురికాకుండా ఆలోచించి ఓటేయాలని సూచించారు.ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన తనకి లేదని పేర్కొన్నారు.
తమిళనాడులో స్టార్ హీరో విజయ్ పార్టీ పెట్టడానికి స్వాగతిస్తున్నట్లు నటుడు సుమన్ వ్యాఖ్యానించారు.