బుల్లితెర కమెడియన్లలో ఒకరిగా అలీ మంచిపేరును సంపాదించుకున్నారు.సాయికుమార్ హోస్ట్ గా ప్రసారమవుతున్న వావ్ 3 ప్రోగ్రామ్ కు అలీ, రాజా రవీంద్ర, సుమన్ శెట్టి, కరాటే కళ్యాణి హాజరయ్యారు.
సాయికుమార్ సుమన్ శెట్టిని నెగటివ్ రోల్స్ చేయాలని ఉందా.? అని అడగగా డబ్బింగ్ వేరేవాళ్లు చెబితే బాగానే ఉంటుందని రాజా రవీంద్ర చెబుతాడు.ఆ తర్వాత తాను లేదా రవి శంకర్ డబ్బింగ్ చెబుతామని సాయికుమార్ అంటాడు.
రాజా రవీంద్రను ఇండస్ట్రీలోకి ఎప్పుడొచ్చావని అడగగా గుర్తులేదని రాజా రవీంద్ర చెబుతాడు.
సాయికుమార్ తన మనవరాలు, ఆయన కూతురు ఫ్రెండ్స్ అని వెల్లడిస్తాడు.రాజా రవీంద్ర వెంటనే మీ ఇద్దరికీ జనరేషన్ గ్యాప్ ఉందా అని అడగా తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని వెల్లడిస్తాడు.
అలీ ఏఎన్నార్ కు 90వ బర్త్ డే చేస్తుంటే నాకు ఇష్టమైన కొంతమందికి నా చేతుల మీదుగా సన్మానం చేయాలని ఆయన అన్నారని అలీ తెలిపారు.
కృష్ణ, విజయనిర్మల, ఆర్ నారాయణమూర్తి, కోడి రామకృష్ణ పేర్లతో పాటు తన పేరు కూడా ఏఎన్నార్ చెపారని అలీ చెప్పుకొచ్చారు.

రాజా రవీంద్ర తాను హీరోల డేట్లు చూస్తుంటానని వాళ్ల కెరీర్ పై ఉన్న ఆసక్తి తన కెరీర్ పై ఉండదని అలీ పేర్కొన్నారు.అలీ మదర్ ను నేను లైఫ్ లాంగ్ మరిచిపోలేనని నాకు బ్యాక్ పెయిన్ సమస్య వస్తే ఆవిడ ఎంతో తపన పడ్డారని సాయికుమార్ అన్నారు.

అలీ నీ ఫైనల్ డ్రీమ్ ఏంటి.? అని అడగగా నాకు ఒక ట్రస్ట్ ఉందని ఆ ట్రస్ట్ ద్వారా లక్ష మందికి సహాయం చేయాలని అనుకుంటానని ఇప్పటికీ 10,000 మందికి సాయం చేశానని వెల్లడించారు.అలీ తన ట్రస్ట్ ద్వారా చేస్తున్న సహాయ కార్యక్రమాల గురించి తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.