సమాజంలో పరిస్థితులు రోజు రోజుకి దిగజారి పోతున్నాయి.భార్యాభర్తల మధ్య గొడవలు అక్రమ సంబంధాలు ఇటువంటి తరుణంలో అక్రమ సంబంధాలు అడ్డుగా ఉన్న పిల్లలను హతమార్చడం వంటి సంఘటనలతో రోజురోజుకు సమాజంలో మానవత్వం మసకబారి పోతుంది.
శరీర కోరికల కోసం అదే రీతిలో ఆస్తుల కోసం కన్నవారిని కట్టుకున్న వారిని రక్త సంబంధాలను లెక్కచేయకుండా హతమారుస్తూ…ఇష్టానుసారంగా మనిషి మృగంలా ప్రవర్తిస్తున్నాడు.అనురాగం అనేది సమాజంలో ఉన్న కొద్ది తగ్గిపోతున్న పరిస్థితి.
ఇటువంటి తరుణంలో హైదరాబాద్ వనస్థలిపురం లో ఆస్తి కోసం కన్న కొడుకులు వేధింపులకు తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి నెలకొంది.
వివరాల్లోకి వెళితే.
హైదరాబాద్ వనస్థలిపురంలో ఉంటున్న వృద్ధులు కొడుకులకు ఆస్తులు పంచడం జరిగింది.వాళ్లకి ఆల్రెడీ పెళ్లిళ్లు కూడా అయిపోయాయి.
అయినా కానీ కొడుకులు ఉన్న ఇంటిని అమ్మాలని తల్లిదండ్రులపై రోజు వేధింపులకు పాల్పడుతూ ఉండటంతో .బలవన్మరణానికి పాల్పడి మరణించారు.దీంతో ఈ సంఘటన స్థానికులను కలచివేసింది.మృతి చెందిన ఈ వృద్ధ దంపతుల పేర్లు మోహన్ రెడ్డి, అనంతలక్ష్మి.వీరికి ఇద్దరు కొడుకులు.

మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు.ఇద్దరు కొడుకులను ప్రయోజకులను చేసి పెళ్లిళ్లు చేసి కోట్ల ఆస్తిని వాళ్లకి కట్టబెట్టారు.ఉన్న 12 ఎకరాలను ఇద్దరు కొడుకులకు సమానంగా పంచడం జరిగింది.
ఆస్తి పంపకాలు అయిపోయిన కానీ ఇద్దరు కొడుకులు మోహన్ రెడ్డి అనంతలక్ష్మి ఉంటున్న ఇంటిని అమ్మాలని… వచ్చిన డబ్బును పంచాలని భయంకరంగా టార్చర్ పెట్టడంతో ఈ వృద్ధ దంపతులు.కొడుకు పెట్టిన టార్చర్ కి బలవన్మరణం పాల్పడటం జరిగింది.