కార్తిక్ రాచపూడి, సంయుక్త గాలి హీరో హీరోయిన్లుగా కిగోర్ దర్శకత్వంలో కేఆర్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న వార్‌మెన్ బేస్ -51 చిత్రం పూజా కార్యక్రమాలతో ఈ రోజు ప్రారంభమైంది.మొదటి సన్నివేశానికి విజన్ మ్యాజిక్ సీఈఓ సాంభశివ రావు క్లాప్ కొట్టగా నిర్మాత రాచపూడి మాధురి కెమెరా స్విచ్ఆన్ చేశారు.దర్శకుడు కిగోర్ ఫస్ట్ షాట్‌ని డైరెక్ట్ చేశారు.
యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ విశ్వ కీలకపాత్రలో నటిస్తున్నాడు.ఈ నెలాఖరు నుండి షూటింగ్ ప్రారంభంకానుంది.
ఈ సందర్భంగా హీరో కార్తిక్ రాచపూడి మాట్లాడుతూ – “ఒక యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవు తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.దర్శకుడు కిగోర్ మంచి స్క్రిప్ట్ రాశారు.
తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా“ అన్నారు.
హీరోయిన్ సంయుక్త గాలి మాట్లాడుతూ – “నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్.
ఒక మంచి సినిమాతో త్వరలో మీ ముందుకు వస్తాం“అన్నారు.
దర్శక నిర్మాతలు మాట్లాడుతూ – “ఈ రోజు మా మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.మంచి స్క్రిప్ట్ కుదిరింది.
యాక్షన్ థ్రిల్లర్ జోనర్.కార్తిక్, సంయుక్త పాత్రలు కొత్తగా ఉంటాయి.
పెర్‌ఫామెన్స్‌కి మంచి స్కోప్ ఉంటుంది.తప్పకుండా వారిద్దరికీ ఈ సినిమా మంచి పేరు తెస్తుందని భావిస్తున్నాం.
ప్రీ ప్రొడక్షన్ పూర్తయ్యింది.అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం“ అన్నారు.
నటీనటులు:
కార్తిక్ రాచపూడి, సంయుక్త గాలి, విశ్వ.
సాంకేతిక వర్గం
దర్శకత్వం: కిగోర్, డిఓపి: కిగోర్, మ్యూజిక్: రిబిన్ రిచర్డ్, ఎడిటర్: పివి రామాంజనేయ రెడ్డి, ఫైట్స్: రాబిన్ సుబ్బ, లిరిసిస్ట్: కె కె, పాటలు: నిహల్ సాధిక్, పీఆర్ఓ: తేజస్వి సజ్జ.