మెడికో ప్రీతి కేసులో నిందితుడు సైఫ్ కీ నాలుగు రోజుల కస్టడీ..!!

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.సీనియర్ వేధింపులు తలలేక ప్రీతి హానికరమైన ఇంజక్షన్ తీసుకొని.

 Accused Saif In Medico Preethi Case Four Days Custody , Medico Preethi Case, Sai-TeluguStop.com

ఆత్మహత్యకు పాల్పడింది.దీంతో హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రిలో ఐదు రోజుల మృత్యువుతో పోరాడి ఓడిపోవడం జరిగింది.

అయితే ఈ కేసులో నిందితుడు సైఫ్ ను పోలీసులు అరెస్టు చేశారు.ఈ క్రమంలో సైఫ్ కు పోలీసుల కస్టడీకీ కోర్టు నాలుగు రోజులు అనుమతించడం జరిగింది.

రేపటి నుంచి నాలుగు రోజుల పాటు కస్టడీ విధించింది.

న్యాయస్థానం అనుమతితో రేపటినుండి వరంగల్ పోలీసులు సైఫ్ ను కస్టడీలోకి తీసుకొనున్నారు.ఇదిలా ఉంటే ప్రీతి ఘటనలో ర్యాగింగ్ జరిగిందని ప్రిన్సిపాల్ ఒప్పుకున్నారు.ఫిజికల్ గా కాకుండా మానసికంగా కూడా వేధించినట్లు తెలిపారు.

మానసిక వేధింపులను కూడా  ర్యాగింగ్ గానే పరిగణించినట్లు తెలిపారు.అంతేకాకుండా రేపు యాంటీ ర్యాగింగ్ కమిటీ నివేదిక కూడా పంపుతామని స్పష్టం చేశారు.

యూజీసీ నిర్ణయాలు ప్రకారం సైఫ్ పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube