రాష్ట్రంలో జరిగే కొన్ని కొన్ని సంఘటనలు వెలుగులోకి రాకుండానే పీకనొక్కబడుతున్నాయనే ఆరోపణలు ఎప్పటి నుండో వస్తున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా అధికార పార్టీ నేతల విషయంలో ఇప్పటికి ఇలాంటి ఆరోపణలు బయటకు వస్తూనే ఉన్నాయి.
కోవిడ్ సమయంలో నిబంధనలు పాటించకుండా పార్టీలు, బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్న ఘటనలు కూడా వెలుగు చూశాయి.ఇలాంటి వారి పైన చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే కనిపించలేదు.
ఇకపోతే తాజాగా కంటోన్మెంట్ మల్లారెడ్డి గార్డెన్ ఎదురుగా ఉన్న నిర్మాణుష్య ప్రాంతంలో పేకాట ఆడుతున్నట్లుగా పక్కాగా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపుదాడి చేసి 11 మంది నిందితులు అరెస్ట్ చేశారట.అందులో అధికార పార్టీలో ప్రముఖ మంత్రిగా చెలమని అవుతు, పలు వివాదాలకు కేంద్రబిందువుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మంత్రి సోదరుడు ఉన్నట్లుగా సమాచారం.
కాగా అదుపులోకి తీసుకున్న వారిని విచారణ నిమిత్తం బోయిన్ పల్లి పోలీస్ ష్టేషన్‌కు తరలించారట.అయితే ఈ విషయంలో పోలీసులు మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు…
.