చిన్నప్పుడు పలు తెలుగు చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించి పెద్దయిన తర్వాత హీరో, హీరోయిన్లుగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమై బాగానే రాణిస్తున్న నటీనటులు చాలామంది ఉన్నారు.కాగా ఇప్పటికే వెటరన్ హీరో తరుణ్, తేజ సజ్జ, బాలదిత్య, తదితరులు హీరోలుగా నటించే సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్నారు.
కాగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “జై చిరంజీవ” చిత్రంలో హీరో మేనకోడలు పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ “శ్రియ శర్మ” గురించి సుపరిచితమే.కాగా పెద్దయిన తర్వాత శ్రియ శర్మ 2016వ సంవత్సరంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “జి.
నాగ కోటేశ్వర రావు” దర్శకత్వం వహించిన “నిర్మలా కాన్వెంట్” చిత్రంలో హీరోయిన్ గా నటించింది.ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులని బాగానే అలరించింది.
దీంతో ఈ అమ్మడు హీరోయిన్ గా బాగానే రాణిస్తుందని అందరూ అనుకున్నారు.కానీ పలు అనివార్య కారణాల వల్ల గత కొద్ది కాలంగాశ్రియ శర్మ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది.
కానీ అప్పుడప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో మాత్రం బాగానే యాక్టివ్ గా ఉంటోంది.కాగా ఇటీవల కాలంలో శ్రియ శర్మ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి ఫోటోలను ఒకసారి పరిశీలించినట్లయితే ఈ లాక్ డౌన్ సమయంలో బరువు బాగా పెరిగినట్లు తెలుస్తోంది.
అయితే ఒకప్పుడు శ్రియ శర్మ సన్నని నడుము అందాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.కానీ ఈమధ్య సినిమా అవకాశాలు లేకపోవడంతో బరువు పెరిగి బొద్దుగా కనిపిస్తోంది దీంతో నెటిజన్లు మాత్రం శ్రియ శర్మ బొద్దుగా ఉన్నా సరే చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా నటి శ్రియ శర్మ తన చదువుని పూర్తి చేయడం కోసమే సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.కాగా ఇటీవలే శ్రియ శర్మ లా చదువులో డిగ్రీ పూర్తి చేసినట్లు సమాచారం.
మరి ఈ అమ్మడు సినిమాల్లో కంటిన్యూ అవుతుందో లేక తన చదువుకు తగ్గ ఉద్యోగం చూసుకుని సెటిల్ అవుతుందో చూడాలి.
ఈ విషయం ఇలా ఉండగా శ్రియ శర్మ తెలుగు, తమిళం, కన్నడ తదితర భాషలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపుగా పది కి పైగా చిత్రాలలో నటించింది.ఆ తర్వాత తెలుగులో గాయకుడు, నిర్మలా కాన్వెంట్, తదితర చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.అంతేకాకుండా హిందీలో కూడా “బిల్లు గేమర్” అనే చిత్రంలో కూడా నటించింది.
కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.