కన్నడ సూపర్ స్టారు అంబరీష్‌తో ప్రేమలో పడ్డావు ఓకే , కాని అతడితో అనుక్షణం జాగ్రత్తగా ఉండాలని అప్పటి తోటినటి సుహాసిని సుమలతతో చెప్పినట్లు సాక్షాత్తు సుమలత ఈరోజు చెప్పారు.సినీ రంగంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిలో చాలావరకు సజావుగా ఉంటాయి .
మరికొన్ని నటీనటుల సంసార జీవితాల్లో చాలా వరకు విడిపోవడాలతో సరిపోతాయి అలా జీవితాన్ని అన్యోన్యంగా మలచుకునే సినీరంగం లో కన్నడ నటుడు అంబరీష్, నటి సుమలత అని చెప్పక తప్పదు సుమలత 1990 ప్రాంతంలో తమిళం, తెలుగు, కన్నడం చిత్రాల్లో హీరోయిన్‌గా చిత్రాలు చేసారు.ఆమె సహజంగా అందంగా ఉండడం తో అంబరీష్ కన్ను పడింది.
అంబరీష్ ఒకింత స్పీడు ఎక్కువ.సుమలతను ప్రేమ ముగ్గులోకి దించేసి తాను పీకలోతు దిగిపోయాడు.
సుమలత కూడా వదిలి ఉండలేని స్థితికి వచ్చేసింది .ఆ సమయంలో అంబరీష్‌తో జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించిన వారిలో నటీమణులలో సుహాసిని కూడా ఉన్నారట.ఈ విషయాన్ని నటి సుమలత స్వయంగా చెప్పి అందరిని చకితులను చేసారు .వివాహ జీవితం గురించి నెమరు వేసుకున్నప్పుడు ఇదంతా చెప్పారు.ఆయనతో తన జీవితాన్ని ముడిపెట్టుకోవాలనుకున్నప్పుడు నటి సుహాసినితో పాటు పలువురు అంబరీష్‌తో జాగ్రత్తగా ఉండు అంటూ హెచ్చరించారన్నారు.తన మేకప్‌మన్ కూడా అంబరీష్ విషయం లో చాల జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారన్నారు.
అయినా అంబరీషే తనకు నచ్చడంతో ఆయన్నే ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, ఇప్పటి వరకు తమఅన్యోన్యత సంతోషంగా సాగుతోంది అని చెప్పారు .