సినిమా తీద్దామనే ఉబలాటం ఇప్పుడు కొత్తజనరేషన్లో ఒక జాడ్యం అయ్యింది అందులో చాలా వరకు అర్ధం కానివే ఉన్నాయి.కానీ, కొన్నిషార్టు ఫిలిమ్స్ స్పీడందుకున్నాయి చుట్టూ ఉన్న ప్రపంచం గురించి, అందులోని ప్రధాన సమస్యలు గురుంచి అప్పుడప్పుడూ కాస్త పట్టించుకోవాలని చెప్పే చక్కటి సందేశాత్మక చిన్ని చిత్రాలు ఏమి కానట్టు కుర్రకారు తీసేసి యూ ట్యూబ్ లో పెట్టేస్తున్నారు .
ఈమధ్య ఐదురూపాయిలకే అడ్రస్ చెప్పబడును.అనే షార్టు ఫిలిం తీసేసి పలువురు మెప్పు పొందాడో కుర్ర దర్శకుడు.
ఓ టీ దుకాణంలో అడ్రస్ అడిగితే,ఐదు రూపాయలు ఇస్తేనే చెబుతానంటాడు సదరు టీయజమాని.నువ్వేమిటిలా డబ్బులు తీసుకుంటున్నావని అడిగేవారు లేకపోరు.
ఊరకే ఎందుకు చెప్పాలి అని ఐదు రూపాయలు కోసం చేయి చాస్తాడు.డబ్బు ముట్టగానే కోరిన అడ్రస్ అతడి నోటి నుంచి అలవోకగా వచ్చేస్తుంది.చాలామంది అడ్రస్ తెలియక అతనికి రూ.5 నాణెం చెల్లించి అడ్రస్ తెలుసుకుంటారు.అలా డబ్బుతీసుకున్న టీమాస్టారుఅర్ధరాత్రి పూట ఓహాస్పిటల్ ముందు అన్నం ప్యాకెట్లు పంచిపెడుతూ కనిపిస్తాడు.అతడిని గుర్తుపట్టి పలుకరిస్తారు ఐదు రూపాయిల బాధితులు .వీళ్ల ఐదు వేళ్లూ ఒక పూట నోట్లోకి వెళ్లడానికి అక్కడ ఐదు రూపాయలు వసూలు చేస్తున్నానని ఒకింత అర్ధమయ్యేలా చెబుతాడు టీ మాస్టారు.దర్శకుడు పరిపూర్ణాచారి కేవలం మూడే నిముషాల్లో భలేగా చిన్ని చిత్రాన్నిఒక మంచి సందేశాన్ని తెరకెక్కించారు
.