సాధారణంగా సీడెడ్ ఏరియాలో మాస్ సినిమాలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ఎక్కువ సంఖ్యలో మాస్ సినిమాలలో నటించి విజయాలను సొంతం చేసుకుంటున్నారు.
సీడెడ్ లో తారక్ నటించిన సినిమాలలో 8 సినిమాలు డే1 కలెక్షన్లతో రికార్డులను క్రియేట్ చేశారు.ఈ రీజన్ వల్లే జూనియర్ ఎన్టీఆర్ ను సీడెడ్ కింగ్( Ceeded King ) అని అంటారని ఫ్యాన్స్ చెబుతున్నారు.
రామ్ చరణ్( Ram Charan ) నటించిన 4 సినిమాలు, ప్రభాస్( Prabhas ) నటించిన 3 సినిమాలు సీడెడ్ కలెక్షన్ల విషయంలో సత్తా చాటాయి.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సాధించిన డే1 రికార్డులు అభిమానులకు మాత్రం ఎంతో సంతోషాన్ని కలిగించాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ( Devara ) సీడెడ్ లో 30 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
![Telugu Ceeded Ntr, Chiranjeevi, Devara, Jr Ntr, Ntr, Mass, Ntr Ceeded, Ntr Craze Telugu Ceeded Ntr, Chiranjeevi, Devara, Jr Ntr, Ntr, Mass, Ntr Ceeded, Ntr Craze](https://telugustop.com/wp-content/uploads/2024/11/young-tiger-junior-ntr-is-the-ceded-king-detailsa.jpg)
చిరంజీవి నటించిన ఒక సినిమా, పవన్ కళ్యాణ్ నటించిన ఒక సినిమా సీడెడ్ డే1 కలెక్షన్లతో సంచలనాలు సృష్టించిందని చెప్పవచ్చు.టాలీవుడ్ హీరోలలో ఈ హీరోలు మాత్రమే సీడెడ్ హీరోలు సత్తా చాటారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.సీడెడ్ ఏరియాలో అన్ని సినిమాలు హిట్ కావనే సంగతి తెలిసిందే.
క్లాస్ సినిమాలు ఈ ఏరియాలో ఆశించిన స్థాయిలో సక్సెస్ కావు.
![Telugu Ceeded Ntr, Chiranjeevi, Devara, Jr Ntr, Ntr, Mass, Ntr Ceeded, Ntr Craze Telugu Ceeded Ntr, Chiranjeevi, Devara, Jr Ntr, Ntr, Mass, Ntr Ceeded, Ntr Craze](https://telugustop.com/wp-content/uploads/2024/11/young-tiger-junior-ntr-is-the-ceded-king-detailss.jpg)
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలతో సైతం సీడెడ్ లో నెక్స్ట్ లెవెల్ లో అదరగొట్టాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ సినిమా సినిమాకు లుక్స్ ను మార్చుకుంటూ ఉండగా తన లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.తారక్ రేంజ్ అంచనాలకు మించి పెరుగుతోందనే సంగతి తెలిసిందే.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్2 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.