ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) నేడు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు.‘దీపం-2’ పథకంలో భాగంగా ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం మండలంలోని ఈదుపురంలో లబ్దిదారులుకు ఉచిత గ్యాస్ సిలిండర్లను( free gas cylinder) సీఎం స్వయంగా అందజేసిన తరువాత లబ్ధిదారుడి వంటింట్లోకి వెళ్లి సీఎం చంద్రబాబు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి మరి టీ పెట్టారు.అనంతరం ఆ టీ ని సీఎం చంద్రబాబు తో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి నాందెడ్ల మనోహార్, కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుతో కలిసి తాగారు.

ఇక మరొకవైపు సీఎం చంద్రబాబు స్వయంగా తన ఇంటికి వచ్చి గ్యాస్ సిలిండర్( gas cylinder) పథకంలో భాగంగా సిలిండర్ ఇలా అందజేయడంతో ఆనందంలో మునిగిపోయింది సదరు కుటుంబం.అయితే, ఇటీవల జరిగిన ఎన్నికలలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామంటూ టీడీపీ పార్టీ మానిఫెస్టోలో చంద్రబాబు నాయుడు తెలియజేసిన సంగతి అందరికీ తెలిసిందే.అందులో భాగంగానే సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం ముందు అడుగు వేస్తుంది.

దీపం-2 (Lamp-2) పథకంలో భాగంగా ఈ ఉచిత సిలిండర్ లను ప్రభుత్వం ప్రజలకు అందజేస్తుంది.ఈ ఉచిత గ్యాస్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం నుంచి బుకింగ్స్ ప్రారంభమయ్యాయని అందరికీ తెలిసిన విషయమే.సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నట్లు సమాచారం.
దీంతో పేదలపై ఉన్న గ్యాస్ భారం కాస్త తగ్గుతుంది.ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లను నాలుగు నెలలకు ఒకటి చొప్పున సదరు లబ్ధిదారులకు పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వం తెలియచేసింది.
ఇలా ఫ్రీగా గ్యాస్ సిలిండర్లను కూటమి ప్రభుత్వం అందచేయడం ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది అని కొందరి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.