దేవర సినిమా( Devara Movie ) రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదలవుతోంది.తెలుగు రాష్ట్రాల్లో దేవర సినిమాకు సంబంధించి 400కు పైగా బెనిఫిట్ షోలు ప్రదర్శితం అవుతుండగా దాదాపులో అన్ని షోలు హౌస్ ఫుల్ అయ్యాయి.
దేవర సినిమాకు సంబంధించి ఎక్కడ చూసినా సోల్డ్ ఔట్ బోర్డులు దర్శనం ఇస్తూ ఉండటం గమనార్హం.దేవర పవర్ మామూలుగా లేదుగా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చిన్నచిన్న ఊర్లలో సైతం దేవర సినిమా బెనిఫిట్ షోలు( Devara Benefit Shows ) ప్రదర్శితం అవుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.బుక్ మై షోలో దేవర సినిమాకు 7,53,000 లైక్స్ వచ్చాయి.
ఆర్టిసి క్రాస్ రోడ్స్ లోనే దేవర కలెక్షన్లు కోటి మార్క్ ను దాటే అవకాశాలు అయితే ఉన్నాయి.బుకింగ్స్ అంతకంతకూ పెరుగుతుండటం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం.
మరోవైపు దేవర సినిమాకు టికెట్లు బుక్ కావట్లేదని కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.దేవర సినిమాతో థియేటర్లకు పూర్వ వైభవం రావడంతో పాటు కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ కావడం పక్కా అని సినీ అభిమానులు ఫీలవుతున్నారు.దేవర సినిమా హిందీ బుకింగ్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.దేవర సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) దేవర మూవీ కచ్చితంగా బాక్సాఫీస్ ను షేక్ చేసే మూవీ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.దేవర సినిమాలో ట్విస్టులు సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది.కొరటాల శివ ఈ సినిమాతో మ్యాజిక్ చేయడం పక్కా అని అభిమానులు భావిస్తున్నారు.దేవర1 అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం పక్కా అని అభిమానులు ఫీలవుతున్నారు.మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.