సాధారణంగా కోట్ల ఆస్తి ఉన్న భర్తలు భార్యలకు కార్లు లేదంటే విలువైన నెక్లెస్‌లు పుట్టినరోజు బహుమతిగా అందజేస్తారు.కానీ ఒక భర్త మాత్రం సంపన్నుడైనా సరే భార్యకు చీప్ గిఫ్ట్ ఇచ్చి షాక్ ఇచ్చాడు.
ఆ భార్య పేరు హన్నా నీల్మన్( Hannah Neelman ).ఈమె సోషల్ మీడియాలో చాలా ఫేమస్.ఆమె స్త్రీద్వేషం కారణంగా బాధితురాలు అయ్యింది.ఆ సానుభూతితో ఆమెకి మరింత పేరు వచ్చింది.ఆమె బాలెరినా ఫామ్( Ballerina Farm ) అనే నిక్‌నేమ్‌తో చాలా రోజులుగా వీడియోలు చేసి ప్రజలను అలరిస్తోంది. టిక్‌టాక్‌లో 7.5 మిలియన్, ఇన్‌స్టాగ్రామ్‌లో 9.1 మిలియన్, యూట్యూబ్‌లో 1.6 మిలియన్ మంది ఆమెని ఫాలో అవుతారు.
ఈ ముద్దుగుమ్మకు అందాల పోటీల్లో పాల్గొన్న అనుభవం ఉన్నది.ఆమె తన భర్తతో కలిసి గ్రామీణ జీవనం గురించి వీడియోలు చేస్తుంది.అయితే రీసెంట్ గా ఆమె షేర్ చేసిన ఒక వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది అందులో భర్త ఆమెకు బర్త్‌డే గిఫ్ట్‌గా
గుడ్డు ఆకారంలో ఉండే ఒక ఏప్రాన్ ఇచ్చాడు.
ఎంత పేదవాడైనా గిఫ్ట్ గా ఇలాంటి గుడ్డ ముక్క ఇవ్వడు.కానీ ఆమె భర్త కోటీశ్వరుడు అయ్యుండి కూడా దీనిని ఇచ్చి షాక్ ఇచ్చాడు
హన్నా నీల్మన్ షేర్ చేసిన టిక్‌టాక్ డానియల్ హన్నాకు ఒక బ్రౌన్ కలర్ బాక్స్ ఇస్తాడు.ఆ బాక్స్‌ను తెరిచి చూస్తే, దానిలో ఒక గుడ్డు ఆకారంలో ఉండే ఏప్రాన్ ఉంది.హన్నా కోరుకుంది ఏంటంటే, తన భర్త తనకు గ్రీస్‌కు వెళ్లడానికి టిక్కెట్లు ఇస్తాడు అని.కానీ, భర్త ఏప్రాన్ తెచ్చి చేతులు దులుపుకున్నాడు.హన్నా భర్త డానియల్, జెట్‌బ్లూ ఎయిర్‌లైన్స్ స్థాపకుడు, బిలియనీర్ డేవిడ్ నీల్మన్ కుమారుడు.
హన్నా తన భర్తను ఈ గిఫ్ట్ గురించి కొంచెం వెక్కిరిస్తూనే ఉంది.మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో షేర్ చేసిన ఒక వీడియోకు దాదాపు 50 లక్షల వ్యూస్ వచ్చాయి.“భర్త ఆమెను బాధపెట్టాలనే ఇలాంటి బహుమతి ఇచ్చి ఉంటాడు.చెడుగా ప్రవర్తించే పురుషులతో మహిళలు ఎందుకు ఉంటారు?” అనే నెటిజన్లు ప్రశ్నించారు.మరికొందరు బహుమతిని సమర్థించారు.