ఎమ్మెల్యే సామేల్ పై అసత్య ఆరోపణలు చేస్తే ఖబర్దార్:దొంగరి గోవర్ధన్

సూర్యాపేట జిల్లా( Suryapet District ): తుంగతుర్తి దళిత ఎమ్మెల్యే మందుల సామెల్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించే ప్రసక్తే లేదని తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్ అన్నారు.గురువారంసూర్యాపేట జిల్లా తుంగతుర్తిమండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ జాతీయ అధిష్ఠానం ఆదేశాల మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ తెచ్చుకొని అనతికాలం ప్రచారంలో సుమారు 52,000 పైచిలుకు మెజార్టీతోఘనవిజయం సాధించిన ఎమ్మేల్యే మందుల సామేల్ పై అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు.

 Khabardar: Dongari Govardhan If False Allegations Are Made Against Mla Samel ,-TeluguStop.com

ఎంపీ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి 70 వేల మెజార్టీ వచ్చేలా, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు 18 వేల పైచిలుకు మెజార్టీ సాధించుటలో అవిరళ కృషి చేశారని కొనియాడారు.గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి చీకటి ఒప్పందాలతో ఇసుక మాఫియా చేసిన స్వార్ధపరులు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరి,నియోజకవర్గానికి అభివృద్ధి పనులు చేస్తున్న దళిత ఎమ్మెల్యే మందుల సామేల్ పై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.

వ్యక్తిగత ఇబ్బందులు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలే తప్ప పార్టీకి నష్టం కలిగించే విధంగా వాట్సప్ లో వార్తలు సృష్టించి ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో వైరల్ చేయడం భావ్యం కాదని హితవు పలికారు.హద్దు మీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నియోజకవర్గ అభివృద్ధికి ఉమ్మడి జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మేల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి,( Ramireddy Damodar Reddy ) స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు,జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ పూర్తిగా సహకరిస్తున్నారనితెలిపారు.

వారి నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులు పార్టీ కోసం, ప్రజల కోసం పనులు నిర్వర్తిస్తున్నారని,విమర్శలకు తావు లేదని,అభివృద్దే మా లక్ష్యమని అన్నారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐకమత్యంతో పనిచేసి అధిక సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఓరుగంటి సత్యనారాయణ,ఓబీసీ సెల్ నాయకులు రుద్ర రామచంద్రు, నల్లు రామచంద్రారెడ్డి,కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చింతకుంట్ల వెంకన్న,కటకం సూరయ్య,కొండా రాజు, ఉప్పుల రాంబాబు యాదవ్, బొంకూరి సుమన్,బొంకురి నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube