తమిళ దర్శకుడు శంకర్( Director Shankar ) దర్శకత్వంలో రామ్ చరణ్( Ram Charan ) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్.( Game Changer ) ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది.ఈ సినిమా కోసం చరణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో తరచూ ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.

ఇకపోతే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ఈ సినిమా అంతకంతకు ఆలస్యం అవుతూనే వస్తోంది.అయితే ఈ ఆలస్యానికి కారణం రామ్ చరణ్ అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరోవైపు ఇండియన్ 2 ( Indian 2 ) పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద, పబ్లిసిటీ మీద బిజీగా వున్నారు శంకర్.మరోపక్కన గేమ్ ఛేంజర్ సినిమాను ఫినిష్ చేయాల్సి వుంది.
వాస్తవానికి ఈ నెలలో ఒక షెడ్యూలు కూడా వుంది.అయితే గతంలో క్యాన్సిల్ అయినా కూడా అనేక షెడ్యూళ్ల జాబితాలోకే ఇదీ చేరుతుందనే అనుమానాలు వుండనే వున్నాయి.
ఈ ప్రకారంగా చూసుకుంటే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనేది అందరిని ఆలోచింపజేస్తున్న ప్రశ్న.జూన్ నెల అయిపోయినట్లే.

జూలై నెల ఖాళీ లేనట్లే.ఆగస్టు నెల అడ్వాన్స్ బుకింగ్ లు అయిపోయినట్లే.ఇక మిగిలింది చివరి నాలుగు నెలలు.ఈ నాలుగు నెలల్లో రావాల్సిన భారీ సినిమాలు లేదా పెద్ద సినిమాలు చాలానే వున్నాయి.ఎన్టీఆర్ దేవర( Devara ) వీటిలో వుండనే వుంది.మీడియం సినిమాలు సంగతి సరే సరి.వీటన్నింటి నడుమ మంచి ఫెస్టివల్ డేట్ ను ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.అయితే మరో ఇరవై నుంచి ముఫై వర్కింగ్ డేస్ షూటింగ్ వుందని తెలుస్తోంది.
ఈ ముఫై రోజుల్లో హీరో రామ్ చరణ్ ఒక పది రోజులు వస్తే చాలు.అంటే వరుసగా డేట్ లు దొరికితే ఇదేమంత పెద్ద టాస్క్ కాదు.
కానీ ఈ సినిమా ఆరంభం నుంచి సమస్య అదే.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం హీరో రామ్ చరణ్ నే తన పనుల వత్తిడి వల్లనో, మరెందు వల్లనో చాలా రోజులు షూట్ క్యాన్సిల్ చేసారని తెలుస్తోంది.అభిమానులు, జనాలు అంతా డైరక్టర్ శంకర్ నే కారణం అనుకుని, అతన్ని తిడుతున్నారు.కానీ యూనిట్ పైకి ఏమీ మాట్లాడడం లేదు.ఎందుకంటే అసలు సంగతి వేరు అని తెలుసు కనుక.అందువల్లే సినిమా ఎప్పటికి పూర్తి అవుతుంది.
విడుదల ఎప్పుడు వుండొచ్చు అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు.