స్పాట్ లెస్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఇంట్లోనే సీరం తయారు చేసుకోండిలా!!

ముఖం మొత్తం ముదురు రంగు మచ్చలతో అసహ్యంగా కనిపిస్తుందా.? మచ్చలను పోగొట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా.? స్పాట్ లెస్ అండ్ గ్లోయింగ్ స్కిన్( Spotless and glowing skin ) కోసం ఆరాటపడుతున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ ఫేస్ సీరం మీకు చాలా బాగా సహాయపడుతుంది.ప్రతిరోజు నైట్ ఈ సీరంను కనుక వాడితే మీ స్కిన్ లో అద్భుతాలు జరుగుతాయి.మరింకెందుకు లేటు అందాన్ని పెంచే ఆ ఫేస్ సీరం ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

 Make Serum At Home For Spotless And Glowing Skin! Face Serum, Serum, Latest News-TeluguStop.com

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం( rice ), వన్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు ( Anise seeds )వేసి అర కప్పు వాటర్ పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న బియ్యం మరియు సోంపును వాటర్ తో సహా వేసుకోవాలి.

అలాగే మూడు కీర దోసకాయ స్లైసెస్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

Telugu Tips, Skin, Homemade Serum, Latest, Serumspotless, Serum, Skin Care, Skin

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive oil ), వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe vera gel ) వేసుకుని బాగా మిక్స్ చేస్తే మన సీరం సిద్ధమవుతోంది.ఈ సీరం ను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ స్టోర్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్‌ ఉంటే తొలగించి వాటర్ తో వాష్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న సీరం ను ముఖానికి అప్లై చేసుకుని పూర్తిగా ఆరిన తర్వాత నిద్రించాలి.

Telugu Tips, Skin, Homemade Serum, Latest, Serumspotless, Serum, Skin Care, Skin

నిత్యం ఈ న్యాచురల్ సీరం ను కనుక వాడితే ముఖంపై ఎంతటి మొండి మచ్చలు ఉన్నా సరే క్రమంగా తగ్గుముఖం పడతాయి.కొద్దిరోజుల్లోనే స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతం అవుతుంది.అలాగే ఈ సీరం మీ చర్మాన్ని గ్లోయింగ్ గా మరియు షైనీగా మెరిపిస్తుంది.ముడతలు ఏమైనా ఉంటే వాటిని తగ్గిస్తుంది.చర్మాన్ని టైట్ గా మారుస్తుంది.అందంగా ఆకర్షణీయంగా కనిపించేలా ప్రోత్సహిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube