హెయిర్ బ్రేకేజ్( Hair breakage ) లేదా జుట్టు విరిగిపోవడం.మనలో చాలా మంది కామన్ గా ఫేస్ చేసే సమస్యల్లో ఇది ఒకటి.
హెయిర్ బ్రేకేజ్ కి అనేక కారణాలు ఉన్నాయి.ఒత్తిడి, ఎండల ప్రభావం, వేడి వేడి నీటితో తలస్నానం చేయడం, హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను అధికంగా వినియోగించడం, ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, తడి జుట్టును టవల్ తో గట్టిగా రుద్దడం తదితర కారణాల వల్ల జుట్టు విరిగిపోతూ ఉంటుంది.
మీరు కూడా హెయిర్ బ్రేకేజ్ తో బాగా ఇబ్బంది పడుతున్నారా.? అయితే అస్సలు వర్రీ అవకండి.
ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే హెయిర్ బ్రేకేజ్ సమస్యకు చాలా సులభంగా చెక్ పెట్టవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ) వేసి ఉడికించాలి.
జెల్లీ స్ట్రక్చర్( Jelly structure ) వచ్చిన అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.క్లాత్ సహాయంతో అవిసె గింజల జెల్ ను సపరేట్ చేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి.
ఇప్పుడు ఈ జెల్ లో ఒక ఫుల్ ఎగ్ బ్రేక్ చేసి వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు కోకోనట్ ఆయిల్( Coconut oil ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే హెయిర్ బ్రేకేజ్ అన్న మాటే అనరు.
కొబ్బరి నూనె( coconut oil ), అవిసె గింజల జెల్ మరియు గుడ్డు జుట్టుకు చక్కని పోషణ అందిస్తాయి.జుట్టు రాలడాన్ని, విరగడాన్ని అడ్డుకుంటాయి.అదే సమయంలో జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.
మరియు ఈ సింపుల్ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల పొడి జుట్టు సమస్య దూరం అవుతుంది.కురులు సిల్కీగా షైనీ గా మారతాయి.
కాబట్టి హెయిర్ బ్రేకేజ్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ సింపుల్ రెమెడీని ప్రయత్నించండి.