పోలింగ్ రోజు మాచర్ల( Macherla )లో మొత్తం ఏడు ఘటనలు జరిగాయని ఏపీ రాష్ట్ర సీఈవో ముఖేశ్ కుమార్ మీనా( AP CEO Mukesh Kumar Meena o ) తెలిపారు.మాచర్లలో ఈవీఎం( EVM ) ధ్వంసమైనా డేటా భద్రంగా ఉందని చెప్పారు.
డేటా భద్రంగా ఉండటం వలనే పోలింగ్ ను కొనసాగించామని సీఈవో తెలిపారు.ఘటనలకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశాలు వచ్చాయని పేర్కొన్నారు.
అదేవిధంగా ఎమ్మెల్యే పిన్నెల్లి( YSRCP MLA Pinnelli Ramakrishna Reddy )పై పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు.ఈ క్రమంలోనే పిన్నెల్లిని ఏ1 నిందితుడిగా చేర్చామన్న సీఈవో నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని వెల్లడించారు.