మానవులు ఎప్పటి నుంచో అంతరిక్షంపై( Space ) గ్రహాలను అన్వేషిస్తున్నారు.ఏదైనా గ్రహంపై జీవం ఉండి ఉంటుందా అని వెతుకుతున్నారు.
ముఖ్యంగా అంగారక గ్రహంపై( Mars ) జీవం ఉండే అవకాశం ఉంటుందని బలంగా నమ్ముతున్నారు.ఇందులో భాగంగా ఇటీవల యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ( ESA ) తో చేతులు కలిపినట్లు నాసా( NASA ) ప్రకటించింది.2028లో ప్రారంభించే ఎక్సోమార్స్ రోసాలిన్డ్ ఫ్రాంక్లిన్ రోవర్( ExoMars Rosalind Franklin Rover ) అనే మిషన్‌పై వారు కలిసి పని చేస్తారు.
ఎక్సోమార్స్ రోవర్ గత లేదా ప్రస్తుత జీవాల ఆనవాళ్లను పట్టుకోవడంపై దృష్టి సారిస్తుంది.
మార్స్ గ్రహాన్ని సమగ్రంగా అన్వేషిస్తుంది.ఆ గ్రహం ఉపరితలం క్రింద తవ్వడానికి ఇది అధునాతన సాధనాలతో సన్నద్ధమవుతుంది.
ఇప్పటి వరకు పంపించిన రోబోలలో ఇదే మొదటిది.ఇది నేల కింద గరిష్టంగా 6.5 అడుగుల లోతు వరకు తవ్వగలదు.దీని వల్ల, రేడియేషన్,( Radiation ) తీవ్ర ఉష్ణోగ్రతల నుండి దాగిన మంచు నమూనాలను సేకరించడం సాధ్యమవుతుంది.
రోవర్‌లోనే ఒక అధునాతన మట్టి పరీక్షాశాల ఉంటుంది.ఈ ల్యాబ్ మార్స్ గ్రహం మట్టి నమూనాలను పరీక్షించి, వాటిలో జీవరాశులకు సంబంధించిన ఆధారాలైన కర్బన అణువులు, ఇతర సంకేతాలను వెతుకుతుంది.నాసా ఈ మిషన్‌లో కీలకమైన పరికరాలను అందిస్తుంది.ఇందులో విజయవంతమైన అంగారక గ్రహ ల్యాండింగ్ కోసం అవసరమైన ప్రొపల్షన్ వ్యవస్థ, హీటర్లు ఉంటాయి.
ఈ కలయిక ప్రాముఖ్యతను నాసా హెడ్‌క్వార్టర్స్ అఫీషియల్ స్టేట్‌మెంట్ నొక్కిచెప్పింది.సైన్స్ మిషన్ డైరెక్టరేట్ సహాయ నిర్వాహకురాలు నికోలా ఫాక్స్, ఈ మిషన్ సోలార్ వ్యవస్థ, దాని వెలుపల అన్వేషణలో యూఎస్, ఐరోపా మధ్య ఉన్న భాగస్వామ్యాన్ని బలపరుస్తుందని నొక్కిచెప్పారు.ఈ రోవర్‌లోని మార్స్ ఆర్గానిక్ మాలిక్యూల్ అనలైజర్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది.ఇది మార్స్ గ్రహం మట్టి నమూనాలలో జీవం అంశాలను గుర్తించడానికి ప్రయత్నిస్తుంది.