తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) అయితే ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ చేస్తున్న సినిమాలన్నీ సెట్స్ మీదే ఉన్నాయి.ఇక గత సంవత్సరం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో చేసిన బ్రో (Bro)సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ ఆ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేదు.
ఇక దాంతో ఈ సంవత్సరంలో తను కొన్ని సినిమాలను రిలీజ్ చేయాలని చూస్తున్నాడు.
ఆయన చేస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో తన బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.
ప్రస్తుతం త్రివిక్రమ్(Trivikram) దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న సురేంద్ర (Surendra)అనే వ్యక్తి డైరెక్టర్ గా మారి ఒక సినిమా చేస్తున్నాడు.ఇక ఈయన చేయబోయే సినిమా సాయి ధరమ్ తేజ్ తోనే ఉండబోతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి.
మరి మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి తన నట విశ్వరూపం చూపించి భారీ సక్సెస్ ని దక్కించుకుంటాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.నిజానికి సాయి ధరమ్ తేజ్ లాంటి స్టార్ హీరోలు ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారు.
కాబట్టి ఈయన కూడా తనదైన రీతిలో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
ఇక తనకు ముఖ్యంగా మెగా ఫ్యామిలీ(Mega Family) అండ ఉంది.
కాబట్టి ఆయనకు సినిమాలు చేసే అవకాశాలైతే ఈజీగా వస్తాయి.కానీ ఆయన నటన ద్వారా తనను తాను ప్రూవ్ చేసుకుంటే ఇంకా మెరుగైన అవకాశాలు కూడా వస్తాయని మరి కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
చూడాలి మరి ఇక మీదట ఈయన చేయబోయే సినిమాలతో సూపర్ హిట్స్ సాధిస్తాడా లేదా అనేది…
.