తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu).ఈయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తూ వస్తున్నాయి.
ఇప్పటివరకు ఈయన చేసిన సినిమాలన్నీ కూడా మాస్ కమర్షియల్ జానర్ కి సంబంధించిన సినిమాలు కావడం విశేషం.ఇక అందులో భాగంగానే ఇప్పుడు చేయబోయే సినిమాకు సంబంధించిన బడ్జెట్ తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది.
ఇక దాదాపు 100 కోట్లతో బాలయ్య బాబు(Balayya Babu) తో ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక ఇందులో బాలయ్య మంచి పవర్ఫుల్ రోల్ లో కనిపించబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి.అయితే ఇది అఖండ(akhanda) సినిమా కి సీక్వెల్ గా వస్తుందా లేదంటే సపరేట్ స్టోరీ తో వస్తుందా అనే విషయాలైతే ఇంకా తెలియాల్సి ఉన్నాయి.ఇక బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండడం సహజం.
ఇక వీళ్ళ కాంబోలో ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాలు కూడా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా ఈ ఇద్దరికీ లంచి క్రేజ్ ను తీసుకువచ్చాయి.అయితే బోయపాటి డైరెక్షన్ లో బాలయ్య బాబు సరి కొత్తగా కనిపిస్తాడని చాలా మంది చెప్తుంటారు.
ఇక నిజానికి బోయపాటి కనక లేకపోతే బాలయ్య బాబు ఈరోజు ఈ స్టేజ్ లో ఉండేవాడు కాదని చాలామంది సినీ విమర్శకులు సైతం ఈ విషయాన్ని చెబుతూ ఉంటారు.నిజానికి బాలయ్య కెరియర్ డౌన్ అయిపోయిన సమయంలో సింహ(Simha ) సినిమాతో బోయపాటి ఒక అదిరిపోయే హిట్ అయితే ఇచ్చాడు.ఇక దానివల్ల ఆయన ఈరోజు ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే బోయపాటి బాలయ్య కాంబో లో వస్తున్న సినిమాలు తొందర్లోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి…
.