ప్రస్తుతం సమ్మర్ సీజన్ రన్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్ లో వేడి గాలి, మండే ఎండ మరియు అధిక ఉష్ణోగ్రత శరీరాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.
పైగా వేసవిలో బాడీ హీట్ భారీగా పెరిగిపోతుంది.అందువల్ల వేసవి నెలల్లో శరీరాన్ని హైడ్రేటెడ్ గా మరియు చల్లగా ఉంచుకోవడం చాలా అవసరం.
ఈ నేపథ్యంలోనే సమ్మర్ హీట్ ను బీట్ చేసి బాడీని కూల్ గా మార్చే టాప్ అండ్ బెస్ట్ జ్యూస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా బాగా పండిన ఒక మామిడి పండు( Mango fruit )ను తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక ఆరెంజ్ పండు( Orange fruit ) తీసుకొని సగానికి కట్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కలు మరియు ఒక కప్పు ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి.
అలాగే అర కప్పు ఫ్రెష్ పెరుగు, రెండు టేబుల్ స్పూన్లు తేనె, నాలుగు ఐస్ క్యూబ్స్ మరియు ఒక కప్పు వాటర్ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.తద్వారా మన మ్యాంగో ఆరెంజ్ జ్యూస్ అనేది సిద్ధమవుతుంది.
వేసవి కాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జ్యూసుల్లో ఇది ఒకటి.ఆరెంజ్ మరియు మామిడి వేసవి కాలంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పండ్లు.మామిడి పండ్లలో విటమిన్ ఎ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.ఆరెంజ్ పండ్లు విటమిన్ సి ( Vitamin C )మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కు గొప్ప మూలం.
మ్యాంగో ఆరెంజ్ జ్యూస్ వేసవి కాలంలో మిమ్మల్ని చల్లబరుస్తుంది.శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో మరియు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడుతుంది.అంతేకాకుండా డీహైడ్రేషన్ బారిన పడకుండా కూడా రక్షిస్తుంది.కాబట్టి వేసవిలో మీరు చల్లగా మరియు హైడ్రేటెడ్‌గా ఉండాలి అనుకుంటే తప్పకుండా పైన చెప్పిన విధంగా మ్యాంగో ఆరెంజ్ జ్యూస్ ను తయారు చేసుకుని తీసుకోండి.