వరలక్ష్మీ శరత్ కుమార్( Varalakshmi Sarathkumar ) ప్రస్తుతం తెలుగులో ఎక్కువ డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరనే సంగతి తెలిసిందే.ఎలాంటి రోల్ ఇచ్చినా వరలక్ష్మి తన యాక్టింగ్ స్కిల్స్ తో పాత్రకు ప్రాణం పోస్తూ ఆఫర్లను పెంచుకుంటున్నారు.
వరలక్ష్మి తాజాగా నిశ్చితార్థం జరుపుకుని అభిమానులను ఒకింత ఆశ్చర్యపరచగా ఈ ఏడాదే ఆమె పెళ్లి పీటలెక్కనున్నారు.అయితే వరలక్ష్మి పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి ఇది రెండో పెళ్లి( Second Marriage ) అనే సంగతి తెలిసిందే.
ఈ విషయంలో వరలక్ష్మి శరత్ కుమార్ ను టార్గెట్ చేస్తూ కొన్ని ట్రోల్స్( Trolls ) సైతం నెట్టింట వైరల్ అయ్యాయి.అయితే తనపై వచ్చే కామెంట్ల గురించి రియాక్ట్ కావడానికి ముందువరసలో ఉండే వరలక్ష్మి శబరి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తనకు కాబోయే భర్త గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
వరలక్ష్మి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు నికోలయ్ సచ్ దేవ్( Nicholai Sachdev ) కాగా మా రిలేషన్ గురించి ఎవరు ఏమనుకున్నా పరవాలేదని ఆమె తెలిపారు.మా నాన్న కూడా రెండు పెళ్లిళ్లు( Two Marriages ) చేసుకున్నారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు.సంతోషంగా ఉంటే రెండు పెళ్లిళ్లు చేసుకున్నా తప్పు లేదని ఆమె తన కామెంట్లతో క్లారిటీ ఇచ్చేశారు.నిలోకయ్ మాజీ భార్య కూడా నాకు పరిచయం ఉందని ఆమె ఆటిట్యూడ్ ను నేను ఎంతగానో ఇష్టపడతానని వరలక్ష్మి పేర్కొన్నారు.
నిలోలయ్ మొదట నాకు ఫ్రెండ్ అని 14 ఏళ్ల క్రితం అతనితో పరిచయం ఏర్పడిందని ఆమె తెలిపారు.
వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన శబరి మూవీ( Sabari ) సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కగా మే నెల 3వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.ఏపీలో ఎన్నికల వల్ల పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు మారడంతో చిన్న సినిమాలు ఎన్నికల నాటికి విడుదలయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.శబరి మూవీ వరలక్ష్మి కోరుకున్న భారీ హిట్ అందిస్తుందేమో చూడాలి.