రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిని పల్లి మండల కేంద్రంలోని చిన్ననాటి స్నేహితుడు బోయిని రాజేశం కు కిడ్నీలు చెడిపోవడంతో అనారోగ్యం తో ఇటీవల ఇబ్బంది ఎదుర్కొనడంతో వారి చిన్ననాటి స్నేహితులు తమ వంతుగా ఆర్థిక సహాయం 15000 రూపాయలు అందజేశారు.ఈ సందర్భంగా వారి చిన్ననాటి స్నేహితులు మాట్లాడుతూ ఎవరైనా మండల ప్రజలు, గ్రామస్తులు తమ వంతుగా
తమ స్నేహితునికి సహాయ సహకారాలు అందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బొటుకు శ్రీనివాస్ ,పులి శ్రీనివాస్, పులి ప్రభాకర్ , బొటుకు తిరుపతి ,జంగం మునీందర్ , బొట్టుకు రాజేశం, జూపల్లి శ్రీనివాస్, జంగం సందీప్ ,జూపల్లి రాములు, మహేష్, బొటుకు శ్రీనివాస్ ,తదితరులు పాల్గొన్నారు.