భారత సంతతికి చెందిన యువ విద్యార్ధిని మెహక్ చందేల్( Mehak Chandel ) ‘‘ మిస్ ఇంగ్లాండ్ 2024 ’’ కిరీటాన్ని కైవసం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచారు.జాతీయ వార్తా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.
సౌతాల్‌లో జన్మించిన మెహక్.క్రిమినాలజీ( Criminology )లో డిగ్రీ చేశారు.
సైకాలజీలో మాస్టర్స్‌ను అభ్యసించాలని భావిస్తున్నారు.ఈ పోటీలో సవాళ్లు వుండవని తాను భావిస్తున్నానని.
గతేడాది జూలైలో తాను దరఖాస్తు చేసుకున్నానని, సెమీఫైనల్ వరకు చేరుకున్నానని చందేల్ అన్నారు.పోటీ అనేది ముందుకు వెనక్కు మారుతూనే వుంటుంది.
అయితే ఇది సరదాగా, సులభమైన ప్రక్రియ అని తాను భావిస్తున్నానని చందేల్ చెప్పారు.
కాగా.ఆమె ముఖంపై వున్న మొటిమల కారణంగా సవాళ్లను కూడా ఎదుర్కొంది.ఈ సమస్య గురించి మెహక్ మాట్లాడుతూ.
తాను చిన్నప్పటి నుంచి మొటిమలతో బాధపడుతున్నానని తెలిపారు.అయినప్పటికీ ప్రింట్ మోడలింగ్, ఫ్యాషన్ పోటీలు.
ఇలా ఏవి అయినా తాను వాటిని దాచడానికి ఎప్పుడూ ప్రయత్నించనని చందేల్ స్పష్టం చేశారు. సెమీఫైనల్స్ సమయంలో జడ్జిల రౌండ్‌లో కూడా తాను చాలా స్పష్టంగా చెప్పానని, ప్రజలు ఈ విషయంలో సిగ్గుపడకూడదని తాను కోరుకుంటున్నానని వివరించినందున తనను ఎన్నుకునేలా చేసిందని భావిస్తున్నట్లు చందేల్ తెలిపారు.
ప్రజలు సహజమైన చర్మం , శరీరాలను చూడటం అలవాటు చేసుకున్నప్పటికి.మెహక్ పడిన కష్టాలను గుర్తుచేసుకున్నారు.ఈ అందాల పోటీలు, ఈవెంట్‌లు లేదా పోటీలలో ఇది ప్రధాన సమస్య ఈ నిర్ధిష్ట పోటీలలో తనకు అంత సమస్య లేదని.కానీ సాధారణంగా మోడలింగ్‌లో చాలా సమస్యలను ఎదుర్కోన్నానని మెహక్ చెప్పారు.
కొందరు వ్యక్తులు తనతో ఫోటో షూట్ చేయడానికి ఇష్టపడరని.మీ ముఖంపై మచ్చలు వున్నాయంటూ చెప్పేవారని గుర్తుచేసుకున్నారు.
ఇకపోతే. మిస్ ఇంగ్లాండ్ 2024 పోటీలు( Miss England 2024 ) మే 16 నుంచి మే 17 వరకు ఇంగ్లాండ్‌లోని వోల్వర్‌హాంప్టన్‌లో జరగనున్నాయి.
మెహక్‌కు భారతదేశంలో మూలాలున్నాయి.ఆమె తండ్రి సిమ్లాకు చెందినవారు తల్లి పంజాబీ.
ఈ పోటీల్లో యావత్ భారతదేశం గర్వించేలా చేస్తానని చందేల్ చెబుతున్నారు.