టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు( Taskforce Former DCP Radha Kishan Rao )పై మరో కేసు నమోదైంది.ఈ క్రమంలోనే రాధాకిషన్ రావుతో పాటు సీఐ గట్టుమల్లు, ఎస్ఐ మల్లికార్జున్ తో సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
క్రియా హెల్త్ కేర్ సంస్థ( Kria Health Care ) డైరెక్టర్లతో కలిసి ఛైర్మన్ వేణుమాధవ్ వద్ద నుంచి బలవంతంగా షేర్లు మార్పిడి చేశారంటూ వారిపై ఫిర్యాదు వచ్చిందని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో 2018 నవంబర్ లో సంస్థ ఛైర్మన్ ను టాస్క్ఫోర్స్ కార్యాలయానికి తీసుకువెళ్లి పత్రాలపై సంతకాలు చేయించారని బాధితులు ఆరోపించారు.
రాధాకిషన్ రావు అరెస్ట్ కావడంతో జూబ్లీహిల్స్ పోలీసులకు( Jubilee Hills Police ) ఓ బాధితుడు ఫిర్యాదు చేశాడని సమాచారం.