ఎట్టకేలకు టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah ) తో నిన్న రాత్రి భేటీ అయ్యారు.చాలాకాలంగా బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఎన్డీఏలో చేరేందుకు తాము సిద్ధమని గతంలోని బాబు అమిత్ షా తో చెప్పారు.అయితే బిజెపి అగ్ర నేతలు మాత్రం ఈ పొత్తుల విషయంలో సైలెంట్ గా ఉండడంతో, బిజెపి తమతో పొత్తు పెట్టుకుంటుందా, ఒంటరిగా ఎన్నికలకు వెళ్తుందా అనే విషయంలో ఏ క్లారిటీ తెలియక పూర్తిస్థాయిలో జనసేన టిడిపిలో అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టింది.
టిడిపి తో పొత్తుల భాగంగా 24 అసెంబ్లీ , మూడు లోక్ సభ స్థానాలను జనసేన( Janasena )కు కేటాయించారు .
బీజేపీతో పొత్తు కుదిరితే ఆ పార్టీకి సీట్లు కేటాయించిన తర్వాత పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించేందుకు టిడిపి జనసేన లు వేచి చూస్తున్నాయి .ఈ నేపథ్యంలోనే పొత్తుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది .అధికారికంగా టిడిపి , జనాసేన ఏ ప్రకటన చేయకపోయినా, ఈ మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లేననే ప్రచారం జరుగుతుంది.నిన్న రాత్రి 10:30 నుంచి 12 10 వరకు అమిత్ షా తో పవన్, చంద్రబాబు( Pawan kalyan, Chandrababu )ను చర్చించారు.బిజెపితో పొత్తులో భాగంగా ఆ పార్టీకి నాలుగు ఎంపీ , 6 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వాలనే ఆలోచనతో టిడిపి ఉంది .అంతకంటే ఎక్కువ స్థానాలు ఇస్తే కూటమికి నష్టం జరుగుతుందనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు.అయితే 10 వరకు లోక్ సభ స్థానాలను బీజేపీ ఆశిస్తోంది.
ఈ సీట్ల వ్యవహారంలోనే ఏ క్లారిటీ రాకపోవడంతో మరోసారి ఈ రోజు సీట్ల అంశంపై చర్చించేందుకు భేటీ కాబోతున్నట్లు సమాచారం .మొత్తానికి ఎన్డీఏలు టిడిపి చేరిక దాదాపు ఖాయంగనే కనిపిస్తోంది.బిజెపితో పొత్తు కుదిరితే రాజకీయంగా తమకు ఎంతో కలిసి వస్తుందని , అధికార పార్టీ వైసీపీని ఓడించేందుకు, అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం అండదండలు అన్ని విషయాల్లోనూ తమకు పుష్కలంగా ఉంటాయని, రాజకీయంగా ఇది తమకు బాగా కలిసి వస్తుందనే లెక్కల్లో టిడిపి అధినేత ఉన్నారు.