భూ వ్యవహారాల్లో జోక్యం చేసుకొని భూ కబ్జాలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు.

భూ కబ్జాలకు సంబంధించిన సమస్యలపై ప్రజలు ధైర్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పిర్యాదు చేయవచ్చు.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భూ సమస్యల్లో జోక్యం చేసుకొని భూ కబ్జాలకు పాల్పడుతూ, నకిలీ భూ పత్రాలు సృష్టించి ప్రజలను మోసం చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్న తంగళ్ళపల్లి మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై తంగళ్ళపల్లి పోలీస్ లు కేసు నమోదు చేయడం జరిగిందని,భూ కబ్జాలకు సంబంధించిన సమస్యలపై ప్రజలు దైర్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పిర్యాదు చేయవచ్చు అని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

 A Case Has Been Registered Against Two Persons Who Are Interfering In Land Affai-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.తంగళ్ళపల్లి మండలంలోని లక్ష్మీపూర్ శివారులో గత 45 సంవత్సరాల క్రితం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గుర్రం అంజయ్య కొనుగోలు చేసిన భూమిలో వ్యవసాయం చేసుకుంటుండగా తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన కోడి అంతయ్య అనే వ్యక్తి అట్టిని భూమిని అక్రమించాలనే ఉద్దేశంతో గుర్రం అంజయ్యను మరి కుటుంబ సభ్యులను బెదిరించి కొంత భూమిని కబ్జా చేసినందుకు అతనిపైన కేసు నమోదు చేయడం జరిగిందని మరియు తంగళ్ళపల్లి శివారులోని శోభ అనే మహిళ యొక్క భూమిని కబ్జా చేయాలనే ఉద్దేశంతో వారి భూమిలోకి అక్రమంగా ప్రవేశించిన కోడి అంతయ్య పైన కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

భూమి పత్రాలు లేకున్నా నకిలీ భూ పత్రాలు సృష్టించి మోసం చేసి డబ్బులు తీసుకున్న వట్టిమల్ల శ్రీనివాస్ పై కేసు నమోదు.భూమి లేకున్నా ఉన్నట్టు నమ్మించి నమ్మకం చేసిన వ్యక్తి పైన కేసు నమోదు తంగళ్ళపల్లి మండలంలోని అంకుషాపూర్ దారిలో గల సర్వేనెంబర్ 160 లో ఉన్నటువంటి రెండు గంటల భూమి తన పేరును లేకపోయినా ఉన్నదని నమ్మించి చిలుక.

శ్రీనివాస్ అనే వ్యక్తి తో ఒప్పందం చేసుకొని అతని వద్ద నుండి 8 లక్షల 40 వేల రూపాయలు తీసుకున్న వట్టి మల్ల శ్రీనివాస్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.జిల్లాలో భూ కబ్జాలు చేస్తూ, నకిలీ భూ పత్రాలు సృష్టించి బెదిరింపులకు పాల్పడే వారి సమాచారం వారి నేర ప్రవృత్తి ప్రజలు ధైర్యంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube